Kannada Yash KGF Chapter 2 new release date
Kannada Yash KGF Chapter 2 new release date

(Kannada Yash KGF Chapter 2 new release date and KGF latest updates along posters details) 2018 లో వచ్చిన కే.జీ.ఎఫ్: చాప్టర్ 1 సినిమాకు సల్లామ్ రాఖీభాయ్.. అంటూ సలామ్ కొట్టారు జనాలు. కన్నడంలో యష్ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా కే.జీ.ఎఫ్. ఈ మూవీ ఎవరు ఊహించని విధంగా.. బాహుబలి తర్వాత జాతీయ స్థాయిలో మరోసారి సౌత్ సినిమాల సత్తా ఏంటో నిరూపించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా కే.జీ.ఎఫ్: చాప్టర్ 2 రూపొందుతోంది. ఫాలోవర్స్ లో ఇప్పటికే బోలెడంత ఉత్కంఠ నెలకొంది. సమ్మర్ రిలీజ్ అంటూ ప్రకటించారు కాబట్టి .. రిలీజ్ తేదీ ఎప్పుడు దగ్గరపడుతుందా? అన్న ఆత్రం అభిమానుల్ని నిలవనీయడం లేదు.

ఫస్ట్ పార్ట్ సంచలన విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. అది దృష్టిలో పెట్టుకొని.. అందుకు ఏ మాత్రం తగ్గకుండా భారీగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఇప్పుడు కే.జీ.ఎఫ్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. ముందుగా అనుకున్నట్టు అన్నీ జరిగితే.. ఈ సినిమాను ఈ ఏడాది జూలైలో రిలీజ్ చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ తాజాగా రిలీజ్ డేట్ మారినట్టు సమాచారం.

పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో షూటింగ్ సహా ఇతర పనులన్నీ బాగా డిలే అవుతున్నాయట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అనుకున్న టైమ్ లో పూర్తవ్వడం కష్టమని యూనిట్ భావిస్తోందట. ఈ నేపథ్యంలో ఈ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనని తెలుస్తోంది. తాజా సన్నివేశం అలా కనిపించడం లేదని తెలుస్తోంది. వేసవి నుంచి ఆగస్ట్ కు వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే కొత్త ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.