ఆ నిర్మాతకు.. ఇద్దరు కూతుళ్ళకు.. కరోనా పాజిటివ్..!

470
Shaza Morani and her actor sister Zoa Morani had tested positive coronavirus

Shaza Morani -Zoa Morani: బాలీవుడ్ కు చెందిన ఎవరికైనా కరోనా వైరస్ సోకిందని తెలిస్తే చాలు.. మొత్తం హాట్ టాపిక్ గా మారిపోతుంది. ప్రజలు కూడా వారి గురించి తెలుసుకోడానికి అంతే ఆసక్తి కనబరుస్తారు. కొద్దిరోజుల కిందట సింగర్ కనికా కపూర్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది.

బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కూతుళ్లు షాజా మొరానీ, జోయా మొరానీలకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియడంతో షాక్ లో ఉంది బాలీవుడ్. ఇప్పుడు కరీమ్ మొరానీకి కూడా పాజిటివ్ అని తేలింది. ఆయన్ను ముంబై లోని నానా వతి ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన కుమార్తెలైన షాజా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో, జోయా కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీమ్ కుటుంబం మొత్తం ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు కరీమ్ మొరానీ అత్యంత సన్నిహితుడు. షారుఖ్ తో ఆయన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ చిత్రాన్ని నిర్మించారు.

బాలీవుడ్ సెలెబ్రిటీలలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కనికా కపూర్ కు, పూరబ్ కోహ్లీకి కరోనా సోకింది. ఇప్పుడు కరీమ్ కుటుంబాన్ని కూడా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఇప్పటికే కనికా కపూర్ ట్రీట్మెంట్ తీసుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యింది.