స్టార్ జంటకు నోటీసులిచ్చిన పోలీసులు

0
355
Karnataka Crime Branch Police Issued Summons Kannada Actors Diganth And Aindrita Ray

Sandalwood Drugs Racket: కన్నడ సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చాలా మంది ఈ రాకెట్‌లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో చాలా మంది అరెస్ట్ అయ్యారు కూడా. స్టార్ జంట దింగత్ మంచలే (diganth), ఐంద్రితలకు (aindrita ray) నోటీసులు జారీ చేశారు.

ఇప్పటికే ఈ కేసులో చాలా మంది అరెస్ట్ అయ్యారు కూడా. రాగిణి ద్వివేదితో పాటు సంజన గిల్రానీ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. ఇంకా తీగ కదిపితే డొంకంతా బయటికి వచ్చేలా కనిపిస్తుంది. అందుకే పోలీసులు కూడా ఇదే పని చేస్తున్నారు. దొరికిన తోకను పట్టుకుని మెల్లగా ఒక్కొక్కరిని బయటికి లాక్కుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నడ స్టార్ జంట దింగత్ మంచలే, ఐంద్రిత రేలకు సీసీబీ పోలీసులు సమన్లు జారీ చేశారు.

విచారణ కోసం బుధవారం ఉదయం 11 గంటలకు సీసీబీ ఆఫీసులో తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ ఫాజిల్ శ్రీలంకలో నిర్వహిస్తున్న ఐ బార్టనే అనే క్యాసినోలో ఈ జంట సందడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో డ్రగ్స్ సరఫరా చేసేవారితో వీరికి ఏమైనా సంబంధాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

దిగంత్, నటి ఐంద్రితా రేకు సీసీబీ తాజా నోటీసులతో కన్నడ చిత్రసీమలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉంటే ఇదే కేసులో ఎ-6 అయిన ఆదిత్య అల్వా రిసార్ట్‌పై ఈ ఉదయం సీసీబీ పోలీసులు దాడి చేశారు. మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడైన ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Previous articleహీరోయిన్ మిమీ చక్రబర్తికి లైంగిక వేధింపులు..
Next article‘ఆదిపురుష్’ కోసం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్