Karthi starrer Kaidhi action thriller movie enters 100 crore club
Karthi starrer Kaidhi action thriller movie enters 100 crore club

కార్తి.. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో. సూర్య తమ్ముడు గా మనకి పరిచయం అయినప్పటికీ విభిన్న కథలు ఎంచుకుంటూ తన నేచురల్ యాక్టింగ్ తో రంజింపజేసే హీరో అనడంలో ఎటువంటి సందేహం లేదు. కార్తీ (karthi) హీరోగా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఖైదీ’ ఖతర్నాక్ జోష్‌లో ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. అక్టోబర్ 25వ తేదీన విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ఐదు రోజులు పూర్తి చేసుకుంది. కార్తీ (karthi) చిత్రానికి మొదట అంతగా రెస్పాన్స్ లేదు. లో రిలీజ్ ఇవ్వడం, ప్రమోషన్స్ లో కూడా కావాలని లో ప్రొఫైల్ మైంటైన్ చేయడంతో ఫోకస్ మొత్తం పోటీగా విడుదలైన విజిల్ తీసుకుపోయింది. అందుకే తొలిరోజు ఖైదీ వసూళ్లు నామమాత్రంగానే మొదలయ్యాయి. టాక్ బలంగా స్ప్రెడ్ అవ్వడంతో కలెక్షన్స్ కూడా పుంజుకున్నాయి.

భారీ యాక్షన్‌ సీన్స్‌తో పాటు కంటతడి పెట్టించే ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు, పాటలు ఉండవు. అయినా బ్లాక్ బస్టర్ కొట్టింది ఈ చిత్రం. విజయ్‌ హీరోగా తెరకెక్కిన బిగిల్‌కు పోటిగా రిలీజ్‌ అయిన ఖైదీ హిట్ టాక్‌ సొంతం చేసుకోవటమే కాదు కలెక్షన్ల పరంగానూ సత్తా చాటుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూల్ చేసి కార్తీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఈ చిత్రం వసూళ్ళు ఇప్పటికీ స్టడీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని కచ్చితంగా ఓ ‘గేమ్ చేంజర్’ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ జోరు ఇలాగే కొనసాగితే ఈ వారాంతానికి 120 కోట్ల మార్క్‌ను కూడా ఈజీగా అందుకోవటం కాయంగా తెలుస్తోంది.