karthi starrer sulthan first look poster released

sulthan first look: కోలీవుడ్ హీరో కార్తీ తాను నటించే ప్రతీ సినిమాను టాలీవుడ్ లో కూడా విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కిందటేడాది ‘ఖైదీ’ అనే మంచి థ్రిల్లర్‌ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో కార్తి.. ఇప్పుడు ‘సుల్తాన్’ అనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ‘సుల్తాన్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కార్తి చాలా స్టైలిష్‌గా, యాంగ్రీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన చేతిలో కొరడా కూడా అదిరిపోయింది. ఈ చిత్రంలో కార్తీ సరసన లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ శాండిల్ వుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కు ‘సుల్తాన్’ తమిళ్ డెబ్యూ మూవీ. మొత్తం మీద ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంటోంది. వివేక్ మెర్విన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రూబెన్ ఎడిటర్. తెలుగు డైలాగులను రాకెందు మౌళి రాస్తున్నారు.