‘సుల్తాన్’ మూవీ రివ్యూ

విడుదల తేదీ : ఏప్రిల్ 02, 2021
రేటింగ్ : 2.75/5
నటీనటులు : కార్తీ, రష్మికా మందన్న, నెపోలియన్, లాల్, కెజిఎఫ్ రామ్, నవాబ్ షా, యోగి బాబు
దర్శకత్వం : బక్కియరాజ్ కన్నన్
నిర్మాత‌లు : ఎస్ఆర్ ప్రకాష్ బాబు మరియు ఎస్ఆర్ ప్రభు
సంగీతం : వివేక్ – మెర్విన్
సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్
ఎడిటర్ : రూబెన్

తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలోనూ మంచి మార్కెట్ తెచ్చుకున్న కార్తీ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘సుల్తాన్’ ఈరోజు రెండు భాషల్లో ఒకేసారి ఆడియెన్స్ ముందుకు వచ్చింది. రష్మికా మందన్నా హీరోయిన్ గా బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి ప్రమోషన్స్ నడుమ రెండు భాషల్లో విడుదలైంది.

కథ
సుల్తాన్ అసలు పేరు విక్రమ్‌. వాళ్ల నాన్న విశాఖపట్నంలో ఒక గాడ్‌ఫాదర్‌. ఆయన్ని, ఆయన ఇంటిని నమ్ముకొని వందమంది పైగా రౌడీలు ఆశ్రయం పొందుతుంటారు. సుల్తాన్‌ను కని వాళ్లమ్మ చచ్చిపోతుంది. గాడ్‌ఫాదర్ మనుషులే సుల్తాన్‌ను పెంచి పెద్ద చేస్తారు. సుల్తాన్ కేమో గ్యాంగ్ వార్ అంటే అస్సలు గిట్టదు. ఈ విషయం మీద తండ్రీకొడుకులకు వాదం జరుగుతుంది. మనల్ని నమ్ముకున్నవాళ్లకు ఏదైనా ఆపద వస్తే కాపాడమని చెప్పి తండ్రి చనిపోతాడు. రౌడీలను ఎన్‌కౌంటర్ చేస్తున్న పోలీసుల నుంచి తన తండ్రి గ్యాంగ్‌ను కాపాడ్డానికి, వాళ్లను అమరావతి దగ్గరున్న ఓ ఊరికి తీసుకుపోతాడు సుల్తాన్‌. ఆ ఊరిని వల్లకాడు చేస్తున్న జయేంద్ర అనే ఇంకో గ్యాంగ్‌స్టర్‌తో తలపడి, అతడిని తరిమేస్తాడు. తన గ్యాంగ్‌తో కత్తి బదులు, నాగలి పట్టించాలని ట్రై చేస్తాడు. సుల్తాన్ ఆశయం నెరవేరిందా? అతడి ఆశయానికి ఎట్టాంటి ప్రాబ్లెమ్స్ ఎదురయ్యాయనేది మిగతా కథ.

సాంకేతిక వర్గం :
టైటిల్ రోల్‌లో కార్తీ పక్కాగా సూటయ్యాడు. రెండు షేడ్‌లు ఉండే ఆ క్యారెక్టర్‌లో అతను జీవించాడు. అతని ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ భలే ముచ్చటగా అనిపిస్తాయ్‌. విలేజ్ గాళ్ రుక్మిణి క్యారెక్టర్‌లో రష్మిక బాగుంది. ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండతో ముఖం చిట్లిచ్చుకుంటా ఎట్లా కనిపించిందో, ఈ మూవీలో కూడా కార్తీని చూసినప్పుడల్లా అట్టా ముఖం మాడ్చుకుంటా కనిపిస్తుందన్న మాట.

తెలుగు డబ్ వర్క్ కూడా బాగుంది. అలాగే టెక్నీకల్ టీం విషయానికి వస్తే సత్యన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమా నేపథ్యానికి తగ్గట్టు డీసెంట్ గా అనిపిస్తుంది.అలాగే యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మంచి ఫ్రెష్ గా సీన్స్ కి తగ్గట్టు ఉంటుంది. అలాగే వివేక్ – మెర్విన్ ల సాంగ్స్ బాగున్నాయి. అయితే రూబెన్ ఎడిటింగ్ బెటర్ గా ఉంటే బాగుండేది.

నరేషన్ లో మంచి యాక్షన్ కామెడీ సహా రాసుకున్న స్ట్రాంగ్ ఎమోషన్స్ బాగా ఎలివేట్ అవుతాయి. యోగిబాబు ఎప్పట్లా బాగా నవ్వించాడు. సుల్తాన్ తండ్రిగా నెపోలియన్ పర్‌ఫెక్ట్‌. తల్లిగా గెస్ట్ రోల్‌లో నిన్నటి హీరోయిన్ అభిరామి కనిపించింది. మిగతా యాక్టర్లు కూడా బాగానే చేశారు.

- Advertisement -

తీర్పు :

మొత్తంగా చూస్తే.. రక్తపాతం వద్దనుకుంటానే, కత్తిపట్టకుండా ఉండలేని పరిస్థితిలో పడ్డ ‘సుల్తాన్’ స్టోరీలో యాక్షన్ ఎపిసోడ్లు, కొన్ని కామెడీ సీన్లు, కొన్ని ఎమోషనల్ సీన్లు బాగా ఉన్నాయ్ అనిపిస్తుంది. సినిమా మొత్తమ్మీద రెండు యాక్షన్ సీన్లు చక్కగా వచ్చాయ్‌. ఒకటి క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ అయితే, ఇంకోటి ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్‌.

సుల్తాన్ బాగా చదువుకొని, వారం రోజులు గడుపుదామని ముంబై నుంచి వైజాగ్ వచ్చాక గ్యాంగ్‌తో అతను గడిపే సీన్లు జోష్ తెచ్చాయ్‌. గ్యాంగ్ మెంబర్ కింగ్ కాంగ్‌గా యోగిబాబు ఎప్పట్లా నవ్వించాడు. ముఖ్యంగా రష్మికతో పెళ్లిచూపుల సీను, దానికి కంటిన్యుటిగా వచ్చే సీన్లు మంచి రిలీఫ్‌గా అనిపించాయ్‌.

కాకపోతే దర్శకుడి కథ పాతగానే ఉన్నా ప్రెజెంటేషన్ లో రాసుకున్న ఎపిసోడ్స్ బాగుంటాయి. కానీ విలన్స్ ను స్ట్రాంగ్ గా చూపించి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా మంచి ఎమోషన్స్ మరియు మాస్ ఎలిమెంట్స్ మాత్రం కావాలి అనుకునే వారికి ఈ వారాంతంలో సుల్తాన్ ఓసారి చూసేందుకు ఛాయిస్ గా నిలుస్తుంది.

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles