Nikhil Karthikeya 2 Latest News Videos and Photos of Karthikeya 2
Nikhil Karthikeya 2 Latest News Videos and Photos of Karthikeya 2

టాలెటెండ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ – 2 ‘ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా చిత్రబృందం ఈ సినిమా హీరోయిన్ గా ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హిట్ అందుకున్న శృతి శర్మను తీసుకున్నట్లు ఇటివలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం నిఖిల్ సరసన హీరోయిన్ గా శృతి శర్మను ఫైనల్ చేయలేదట. ఈ వార్తలు రూమర్స్ అని తెలుస్తోంది. చిత్రబృందం ఇంకా హీరోయిన్ని వెతికే పనిలో ఉందట. ఇప్పటికే పుర్తయిన ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట.

ఎలాగు ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ రెండో వారం నుండి మొదలెట్టనున్నారు. అలాగే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు మరియు సాంకేతికవర్గానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.