Karthikeya 2 OTT Release Date: నిఖిల్ అలాగే అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా కార్తికేయ 2. చిన్న సినిమా అయినా ఈ కార్తిక ఎటు ఎవరు ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద ఈ రోజు వరకు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అభిషేక్ అగర్వాల్, టీజె విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.
తెలుగు అలాగే హిందీలో విడుదలైన ఈ సినిమా వసూళ్ళ పరంగా నిర్మాతలకు బడ్జెట్ కన్నా ఎక్కువగానే మిగిల్చింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 120 కోట్ల గ్రాస్, రూ. 60 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కేవలం రూ. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ విడుదలైన ఈ సినిమా.. దాదాపు నాలుగింతలు ప్రాఫిట్స్ రాబట్టడం విశేషం.
ఎప్పటిలాగే అన్ని సినిమాలు థియేటర్ విడుదలైన తర్వాత ఓటీటీ లో విడుదల అవటం సహజం. అలాగే కార్తికేయ 2 సినిమా కూడా ప్రేక్షకులు అలాగే మూవీ లవర్స్ ఎప్పుడు ఓటు లో విడుదల అవుతుంది అని ఎదురుచూస్తూ ఉన్నారు. కార్తికేయ 2 సినిమా ఓటిటి హక్కులను జీ స్టూడియోస్ వారు దక్కించుకున్న విషయం తెలిసిందే.
Karthikeya 2 OTT Release Date
కార్తికేయ 2 మూవీ సెప్టెంబర్ 30 నుండి అన్ని భాషల్లో ‘జీ5’ ఓటీటీ లో విడుదల కావడానికి సిద్ధం చేసినట్టు సమాచారం అందుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు. మరి కొన్ని రోజులు అయితే కానీ దీనిపై మనకు ఒక క్లారిటీ అనేది రావచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి.