‘చావు కబురు చల్లగా’ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా స్టైలిష్ స్టార్

166
Karthikeya Chavu Kaburu Challaga Pre Release Event AlluArjun coming for Chief Guest
Karthikeya Chavu Kaburu Challaga Pre Release Event AlluArjun coming for Chief Guest

టాలీవుడ్ యంగ్ హీరోల్లో కార్తికేయ ఒకరు. ప్రస్తుతం అతడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కార్తికేయ తాజాగా చేస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా’.

 

ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. యాక్షన్ రొమాంటిక్ కథగా తెరకెక్కతున్న ఈ సినిమాను కౌషిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో బన్ని వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బుల్లితెర బ్యూటీ అనసూయ కీలక పాత్రలో కనిపిచంనున్నారు.

 

ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు, టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి బండి డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈరోజు నిర్వహించాలని అనుకున్నారు.

 

 

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 5:30 గంటల నుండి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.