గుణ 369 ట్రైలర్:పక్కా రోటీన్ గుణమే

Karthikeya Guna369 Theatrical Trailer Talk, Release Date,Cast
Karthikeya Guna369 Theatrical Trailer Talk, Release Date,Cast

కార్తికేయ కి హిట్ తో పాటు హీరోగా స్టాండ్ ఇచ్చిన సినిమా RX100.ఆ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అవ్వడంతో హిప్పీ సినిమాని కాస్త రిచ్ గా తీసారు.కానీ ఆ సినిమా కథా కథనాలు గాడితప్పడం కాదు చాలా ధారుణంగా ఉండడంతో హిప్పీ వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవ్వరికి గుర్తులేదు.కానీ హిప్పీ సినిమా రిలీజ్ కి ముందు కార్తికేయ సైన్ చేసిన గుణ 369 రిలీజ్ కి రెడీ అయ్యింది.అయితే ఈ సినిమా టీజర్ తో ఇది జస్ట్ ఒక కమర్షియల్ సినిమా అని మాత్రమే కన్వే అయ్యింది.దాంతో అంతా ట్రైలర్ గురించి ఎదురు చూసారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

గుణ 369 కి డైరెక్టర్ అయిన అర్జున్ జంధ్యాల బోయపాటి దగ్గర పనిచెయ్యడం వల్ల మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న సింపుల్ లైన్ నే ఎంచుకున్నాడు.సరదా జీవితం గడిపేసే ఒక కుర్రాడు,అమ్మాయిని చూసి ప్రేమలో పడడం.ఆ అమ్మాయిని కూడా తనని ప్రేమించేలా చెయ్యడానికి చాలా ప్రయత్నాలు చేసి అనుకున్నాడు సాధిస్తాడు.ఆ ప్రయత్నాలన్నీ చాలా కామెడీ గా ఉన్నాయి.కానీ ఆమెకి వచ్చిన ప్రోబ్లమ్ కి తాను అడ్డు నిలుస్తాడు.దాంతో తన ఫ్యామిలీ ట్రబుల్స్ లో పడుతుంది.విలన్స్ నుండు తన ఫ్యామిలీ ని,ప్రేమించిన అమ్మాయిని ఎలా కాపాడుకున్నాడు అనేది గుణ 369 లో కథ.ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో కథాపరంగా ఇంతకుమించి ఏమీ లేదు.అలానే సస్పెన్స్ ఎలిమెంట్ ఏమైనా ఉందా అంటే అలా హైడ్ చెయ్యడానికి ఛాన్స్ కూడా లేదు.కథ పరంగా రొటీన్ దారినే ఎంచుకున్న డైరెక్టర్ సీన్స్ మాత్రం కాస్త ఫ్రెష్ గా రాసుకునట్టు ఉంది.

హీరోయిన్ ని సెల్ ఫోన్స్ రేపెయిర్ చేసే అమ్మాయిగా చూపించాడు.దాని వల్ల సినిమాలో ఎంటర్టైన్మెంట్ పండే ఛాన్స్ ఉంది.ఇక ఫైట్ సీన్స్ కూడా పవర్ ఫుల్ గా ఉన్నాయి అని టీజర్ నుండి హింట్స్ ఇస్తున్నారు.మాస్ టికెట్స్ తెగడానికి ఫైట్స్ సరిపోతాయి.అలాగే ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ప్రొడ్యూసర్స్ బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.కార్తికేయ లుక్స్ కూడా బావున్నాయి.ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతున్న ‘అనఘా’ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా డీసెంట్ గా ఉంది.ఖైదీ నెంబర్ 786,ఖైదీ నెంబర్ 150 ల తరహాలో ఈ సినిమాలో హీరో కూడా జైలు కి వెళ్లి 369 నంబర్ ఉన్న డ్రెస్ వేసుకోవడం వల్ల ఈ సినిమాకి అతని పేరుతో కలిపి గుణ 369 అని పేరుపెట్టారు.మరి ఈ గుణ ఎలాంటి విజయం అందుకుంటాడు అనేది ఆగస్టు లో తేలుతుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

 

 
Guna 369 Movie Cast Crew Details
Cast : Karthikeya, Anagha
Director : Arjun Jandyala
Music : Chaitan Bharadwaj
DOP – Ram Reddy
Producers : A. Tirumal Reddy & Anil Kadiyala.
Presented by Praveena kadiyala
Banner : SG Movie Makers

[INSERT_ELEMENTOR id=”3574″]