“సుకుమార్ రైటింగ్స్” బ్యాన‌ర్ పై యంగ్ హీరో కార్తికేయ

94
Sukumar Writings's next film with Young Hero Kartikeya Gummakonda to begin from November copy

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో కార్తికేయ మరో సినిమా కన్ఫర్మ్ అయింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. ఓ వైపు తన సినిమాలతో బిజీగా ఉంటూనే శిష్యులను ఎంకరేజ్ చేస్తూ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై సినిమాలు రూపొందిస్తున్నారు.

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ పై వ‌చ్చిన కుమారి 21 ఎఫ్, ఉప్పెన వంటి చిత్రాలు బ్లాక్ బ‌స్టర్స్ గా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో మార్చి 19న విడుద‌ల అవ్వ‌నున్న కార్తికేయ అప్ క‌మింగ్ మూవీ చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ని చూసి అందులో కార్తికేయ పెర్ఫార్మెన్స్ కి ఇంప్ర‌సై సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ పై ఓ సినిమాను నిర్మించ‌డానికి క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్లాన్ చేశారు. న‌వంబ‌ర్ లో ప్రారంభం అవ్వ‌నున్న ఈ సినిమాకి క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు సుకుమార్ అందిస్తున్నారు. ద‌ర్శకుడు, త‌దిత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

మరోవైపు తొలిసినిమా Rx 100తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కార్తికేయ వరుస సినిమాలతో విజయాలందుకుంటున్నారు. ఈ క్రమంలో సుకుమార్ నిర్మాణంలో కార్తికేయ సినిమా అనే సరికి జనాల్లో ఆసక్తి మొదలైంది. ఇప్పటికే ‘ఉప్పెన’తో తన శిష్యుడు బుచ్చిబాబును డైరెక్టర్‌గా పరిచయం చేసిన సుక్కు.. ఈ మూవీతో మరో శిష్యుడిని డైరెక్టర్‌గా పరిచయం చేయబోతున్నాడని తెలుస్తోంది.