కార్తీ ‘ఖైదీ’ వసూళ్ల పరంగా బాక్సాఫీస్ బొనాంజా

0
237
Karthi's Khaidi movie 5 days box office collections report
Karthi's Khaidi movie 5 days box office collections report

కార్తీ (karthi) హీరోగా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఖైదీ’ ఖతర్నాక్ జోష్‌లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. అక్టోబర్ 25వ తేదీన విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ఐదు రోజులు పూర్తి చేసుకుంది. కార్తీ (karthi) చిత్రానికి మొదట అంతగా రెస్పాన్స్ లేదు. లో రిలీజ్ ఇవ్వడం, ప్రమోషన్స్ లో కూడా కావాలని లో ప్రొఫైల్ మైంటైన్ చేయడంతో ఫోకస్ మొత్తం పోటీగా విడుదలైన విజిల్ తీసుకుపోయింది. అందుకే తొలిరోజు ఖైదీ వసూళ్లు నామమాత్రంగానే మొదలయ్యాయి. టాక్ బలంగా స్ప్రెడ్ అవ్వడంతో కలెక్షన్స్ కూడా పుంజుకున్నాయి.

ఖైదీ చిత్రానికి చాలా తక్కువ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కార్తీ రీసెంట్ ట్రాక్ రికార్డ్ బాలేకపోవడంతో భారీ రేట్లు పెట్టడానికి బయ్యర్లు ముందుకు రాలేదు. దాంతో నాలుగున్నర కోట్లకు తెలుగు రాష్ట్రాల వరకూ ఖైదీని అమ్మారు. కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసారు. ‘ఖైదీ’ సినిమా ఫస్ట్ వీక్ లో ఆ బిజినెస్ మార్క్ ని క్రాస్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చిపెట్టనుంది.

ఏరియాల వారీగా ‘ఖైదీ’ ఐదు రోజుల కలెక్షన్స్ వివరాలు..

నైజాం – 1.58 కోట్లు
సీడెడ్ – 65.8 లక్షలు
గుంటూరు – 25.4 లక్షలు
ఉత్తరాంధ్ర – 44.4 లక్షలు
తూర్పు గోదావరి – 32.2 లక్షలు
పశ్చిమ గోదావరి – 22.4 లక్షలు
కృష్ణా – 32.7 లక్షలు
నెల్లూరు – 17.9 లక్షలు

5 డేస్ మొత్తం షేర్ – 3.98 కోట్లు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here