Kartikeya Gummakonda To Play Nia Officer In Debutant Sri Saripalli's Direction

RX 100 kartikeya gummakonda: యంగ్ హీరో కార్తికేయ మరో సినిమాను అంగీకరించారు. ఈ చిత్రంలో ఆయన ఎన్ఐఏ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యువ హీరో కార్తికేయ ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టాడు. ‘Rx 100’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘గుణ 369’ ‘హిప్పీ’ ’90 ML’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

ఈ సినిమా తరవాత గీతా ఆర్ట్స్‌లో ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా ఓకే చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సినిమాతో పాటు మరో కొత్త సినిమాను కార్తికేయ అంగీకరించారు. ఈ చిత్రం ద్వారా శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాన్య రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాను శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ‘88’ రామారెడ్డి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 21 హీరో కార్తికేయ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను నిర్మాత వెల్లడించారు.

శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో 88 రామారెడ్డి ఈ మూవీని నిర్మించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తెరకెక్కనున్న ఈ మూవీలో కార్తికేయ NIA ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. పలు తమిళ్ చిత్రాల్లో నటించిన యంగ్ బ్యూటీ తాన్య రవిచంద్రన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. సాయి కుమార్ – తనికెళ్ళ భరణి – సుధాకర్ కోమాకుల – పశుపతి కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్.ఆర్.విహారి సంగీతం అందిస్తుండగా పి.సి.మౌళి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.