Kartikeya, Guna 369 Teaser Talk, Tollywood Movie News
Kartikeya, Guna 369 Teaser Talk, Tollywood Movie News

 

ప్రేమతో మీ కార్తీక్ సినిమాతో హీరో గా పరిచయమయిన హీరో కార్తికేయ కి టాలీవుడ్ లో గుర్తింపు ఇచ్చి ప్రేక్షకులకు చేరువ చేసిన సినిమా RX100.ఆ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉన్నా కూడా హీరోయిన్ కొత్త షేడ్ వల్ల ఆ సినిమా మంచి విజయం అందుకుంది.కానీ బోల్డ్ కంటెంట్ మాత్రమే విజయం సాధిస్తుంది అని నమ్మి హిప్పి అనే సినిమా చేసి దారుణమయిన ప్లాప్ ని తన అకౌంట్ లో వేసుకున్నాడు.

దీంతో మళ్ళీ భారీ హిట్ కొడితే తప్ప అతను హీరోగా కంటిన్యూ అయ్యే ఛాన్సులు చాలా తక్కువ.హిప్పీ ప్లాప్ అని యునానిమస్ గా డిక్లేర్ అయిపోవడంతో వీలనంత త్వరగా తన కొత్త సినిమా గుణ 369 తో ప్రేక్షకులముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.టీజర్ లో మాత్రం గుడ్ బాయ్ లా,ఫీల్ ఉన్న లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడు.హీరోయిన్ అనఘ కూడా ట్రెడిషనల్ లుక్ లో క్యూట్ గా కనిపిస్తుంది.కానీ టీజర్ లో హీరో లో మరో యాంగిల్ కూడా రివీల్ చేసారు.ఈ సారి లవ్ మాత్రమే కాదు,యాక్షన్ తో కూడా అదరగొట్టాలి అని ఫిక్స్ అయినట్టున్నాడు.

ఈ సినిమా డైరెక్టర్ పేరు అర్జున్ జంధ్యాల.పేరులో కేర్ ఆఫ్ కామెడీ అయిన జంధ్యాల పేరు ఉన్నా యాక్షన్ కే మారుపేరుగా నిలిచిన బోయపాటి దగ్గర పనిచెయ్యడంవల్ల ఈ కొత్త డైరెక్టర్ కూడా పక్కా కమర్షియల్ మీటర్ లో నడిచే కథ రాసుకున్నాడు.దాన్నే తీసాడు.టీజర్ వరకు చూస్తే కథ అవుట్ డేటెడ్ ఫార్మాట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది.ఇప్పటివరకు బుల్లితెరపై ప్రోగ్రామ్స్ తో సక్సెస్ అయిన జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాతో సినిమా నిర్మాణరంగంలోకి కూడా వస్తుంది.సినిమా నిర్మాణ విలువలు బావున్నాయి.చైతన్ భరద్వాజ్ ఆర్.ఆర్ కూడా ఆకట్టుకుంటుంది.కాకపోతే అనేకసార్లు చూసిన ఈ కమర్షియల్ మీటర్ కథని కార్తికేయ ఎంతవరకు మోయగలుగుతాడు అనేది అనుమానమే.బలమయిన ఎమోషన్స్ ఉంటే తప్ప యాక్షన్ కి వేల్యూ ఉండదు.

మరి అంత టచింగ్ పాయింట్ దేన్ని టచ్ చేసారో చూడాలి.ఒక పక్క విలన్ గా డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్న కార్తికేయ మరో పక్క హీరో గా ఇలా రొటీన్ సినిమా చేసాడు.మరి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో అనేది తెలియాంటే మరికొన్ని రోజులు ఆగాలి.