రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్..!

0
122
Kathi Mahesh seriously injured in a road accident

Kathi Mahesh: సినీ నటుడు ఫిల్మ్ క్రిటిక్ ‘బిగ్ బాస్’ ఫేమ్ కత్తి మహేష్ రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో కత్తి కత్తి మహేష్ కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. కత్తి మహేష్ నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలం, చంద్రశేఖర్ పురం జాతీయ రహదారిపై ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు ఆయన కారు వెనుక నుండి లారీని ఢీకొట్టింది. 

తాజాగా కత్తి మహేష్ రోడ్ యాక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. వీటిలో మహేష్ కు చెందిన ఇన్నోవా కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయి ఉంది. దీనిని బట్టి కారు బలంగా ట్రక్ ను ఢీ కొట్టినట్లు అర్థం అవుతుంది.  ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తలకు గాయాలు కావడం ఆందోళన కలిగిస్తుంది. 

ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.