బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ ల ఎంపిక బాలేదు… కౌశల్

0
601
kaushal manda shocking comments on bigg boss telugu 4 contestants

kaushal manda: Gangavva: కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన సెలబ్రిటీలు తిరిగి ఉపాధిని వెతుక్కునే పనిలో ఉండటం వల్లే బిగ్ బాస్ సీజన్ 4 (bigg boss telugu 4) లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదని బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ అభిప్రాయపడ్డారు. మరో వైపు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో సెలక్షన్ కూడా అంతగా బాలేదన్నారు.నిజానికి బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ ఎంపికపై చాలామంది ప్రేక్షకుల్లో అసహనం ఉంది. గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్‌లో 16 మంది కంటెస్టెంట్లలో చాలావరకూ ముక్కుమొహం తెలియని వాళ్లని తీసుకుని వచ్చారని విరక్తి చెందుతున్నారు.

ఇక పల్లెటూరి నుంచి వచ్చిన బామ్మ గంగవ్వను ఎంపిక చేయడం మాత్రం ఓ అసాధారణ నిర్ణయమని అన్నారు. గంగవ్వ కనీసం ఒక పది వారాల పాటు హౌస్ లో కొనసాగుతారని భావిస్తున్నానని పేర్కొన్నారు. పల్లెటూర్లలో బిగ్ బాస్ చూసే వారి సంఖ్య కూడా పెరుగుతుందని అన్నారు. అయితే ఆల్ రెడీ సెలబ్రిటీ హోదా వచ్చి కోట్లు గడించి.. కావాల్సినంత పాపులారిటీ, క్రేజ్ ఉన్న వాళ్లని కంటెస్టెంట్‌గా తీసుకువచ్చి వాళ్లని విజేతల్ని చేసి చేతిలో ఓ రూ.50 లక్షలు పెట్టడం కంటే.. బిగ్ బాస్ ద్వారా కొత్త వాళ్లను సెలబ్రిటీ హోదా కల్పించడం అయితే ఆహ్వానించతగ్గ విషయమే.

ఇక దర్శకుడు సూర్య కిరణ్ అతిగా ఆవేశపడుతున్నాడని.. తనకే కరెక్ట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని.. అతిగా ఆవేశపడితే కెమెరాల్లో పడతాం అనే ఆలోచనతో అలా చేస్తుంటారు కాని.. అన్నివేళ్లల్లో అది వర్కౌట్ కాదంటున్నాడు కౌశల్.

ఫిజికల్ టాస్క్ లో గెలిస్తే ఫైనల్ వరకు రావచ్చు అని ఎవరూ భావించ కూడదని, గీత మాధురి ఫిజికల్ టెస్ట్ లలో ఆధిపత్యం చూపకుండానే ఫైనల్ వరకు వచ్చిందని అన్నారు. అయితే ఈ సీజన్లో పోటీదారుల కోసం గ్రూపులు తయారయ్యాయని అన్నారు. అంతేకాకుండా కౌశల్ ఆర్మీ ర్యాలీ మాత్రం ‘నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ ‘ వ్యాఖ్యలు చేశారు కౌశల్.

 

Previous articleప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా శ్రియ ’గమనం’
Next articleప్రియాంక లేటెస్ట్ స్టిల్స్