లైగర్ సినిమాలో కవిత పెట్టుబడులు నిజమేనా..?

Kavitha Investment In Liger Movie: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ డిజాస్టర్ ఆయన విషయం తెలిసిందే. ఈ సినిమాకి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు అలాగే ఈ పెట్టుబడులు విదేశాలు నుంచి వచ్చినట్టు ఈడి రెండు రోజుల క్రితం విచారణ మొదలుపెట్టింది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

Kavitha Investment In Liger Movie: విజయ్ దేవరకొండ లైగర్ ఈ సినిమాకి పూరి జగన్నాథ్ అలాగే చార్మి ప్రొడ్యూసర్ గా ఉన్న విషయం తెలిసిందే. విదేశీ పెట్టుబడుల గురించి పూరి అలాగే చార్మి ఇద్దరు గురువారం రోజు హాజరైన విషయం కూడా లేటుగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 13 గంటలపాటు ఈ విచారణ సాగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

లైగర్ సినిమా లో బ్లాక్ మనీని వైట్ చేయడానికే కల్వకుంట్ల కవిత పెట్టుబడులు పెట్టారని ఈడీకి ఫిర్యాదు చేసింది తానేనని బక్కా జాడ్సన్ పేర్కొన్నారు. దీనితోపాటు ఎటువంటి పాన్ ఇండియా మార్కెట్ లేని విజయ్ దేవరకొండ ని ఎంచుకొని సినిమా తీయడం కూడా దీనిలో ప్లానే అని అలాగే.. ప్రభాస్ – మహేశ్ బాబు లాంటి ఐదారుగురు యాక్టర్స్ కు మాత్రమే వాళ్ళని ఎంచుకోకుండా విజయ్ దేవరకొండ ని తీసుకున్నారు..

Kavitha Invested Money on Vijay Devarakonda Liger Movie
Kavitha Invested Money on Vijay Devarakonda Liger Movie

అంటే విజయ్ దేవరకొండ కు కలెక్షన్స్ వస్తాయో రావో ఆమాత్రం తెలియదా? ఇది కచ్చితంగా అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీని వైట్ చేయటానికి తీసిన సినిమా అని కూడా ఆరోపణలు చేశారు. మరి దీనిపై కవిత గారు అలాగే ఈ సినిమాకు సంబంధించిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

 

Related Articles

Telugu Articles

Movie Articles