Keeravani reentry in Mollywood: సంగీత దర్శకుడిగా మరియు గాయకుడిగా ఎన్నో ఆణిముత్యాలు లాంటి పాటలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన సంచలన గాయకుడు కీరవాణి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం మరియు హిందీ భాషలలో ఆయన తన సంగీతాన్ని అందించారు. ఎంతో అందంగా స్వరకల్పన చేయడమే కాకుండా మధురంగా పాడినప్పటికీ కీరవాణి కెరియర్ తొలి దశలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అయితే
Keeravani reentry in Mollywood: బాహుబలి మరియు ఆర్ ఆర్ ఆర్ లాంటి చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీని పాన్ ఇండియన్ రేంజ్కి తీసుకువెళ్లారు. ఆయన స్వరాలు కూర్చిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ప్రస్తుతం ఆయన పేరు ప్రపంచమంతా మారుమోగుతుంది. ఈ క్రమంలో తాజాగా కీరవాణితో సినిమా చేయడానికి పలు ఇండస్ట్రీలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీరవాణి ఓ మలయాళం మూవీకి సంగీతం అందించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. 1996లో దేవరాగం అనే ఓ మలయాళ చిత్రానికి చివరిసారిగా కీరవాణి బాణీలను సమకూర్చారు.
తిరిగి ఇప్పుడు 27 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత కీరవాణి మళ్లీ మాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. అనేక అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆయన మలయాళం చిత్రాలకు దూరంగానే ఉన్నారు. రీసెంట్గా తిరువనంతపురంలో జరిగిన మూవీ పూజా కార్యక్రమంలో పాల్గొన్న కీరవాణి తనకు ఇష్టమైన సంగీత దర్శకుడు బాబు రాజ్ పాడిన కొన్ని మలయాళీ పాటలను కూడా ఆలపించారు.

బాగా గ్యాప్ తర్వాత తిరిగి మలయాళ సినిమా సంగీతం అందించడం పట్ల అతను తన సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఒకవైపు రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తున్నాను అంటూనే ఏమాత్రం దూకుడు తగ్గించకుండా దూసుకుపోతున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ కోసం చాలా చిత్రాలు లైనప్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఓ రకంగా ఆస్కార్ గెలవడం కీరవాణి కి పేరుతోపాటు మంచి అవకాశాన్ని కూడా తెస్తుంది అని చెప్పవచ్చు.
Web Title: Keeravani reentry in Mollywood, Oscar winner Keeravani returns to Malayalam film industry, Keeravani upcoming movie songs, Keeravani latest news, Telugu Movie news