Keeravani Comments on Naatu Naatu: టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన పాట నాటు నాటు. ఆస్కార్ వేదిక మీద కూడా ఈ పాట ప్రదర్శించబడడం నిజంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి గర్వకారణం. కేవలం తెలుగు సినిమాకే కాకుండా యావత్ ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఆ పాట తనకంటూ ఒక స్పెషల్ రికార్డును అందుకుంది. ఆ పాటకు సాహిత్యం అందించింది చంద్రబోస్ అయితే కంపోజ్ చేసింది కీరవాణి. ఈ ఇద్దరు ఆస్కార్ వేదికపై గోల్డెన్ లేడీ ని పొందారు. అయితే ఇంత చరిత్ర కలిగిన ఈ పాట తన బెస్ట్ సాంగ్స్ లిస్టులో లేదు అని కీరవాణి స్వయంగా చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Keeravani Comments on Naatu Naatu: ఆర్జీవి నిజం యూట్యూబ్ ఛానల్ లో కీరవాణి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్లో వైరల్ అయింది. ఆస్కార్ వెనక నాటు నిజం అంటూ రాంగోపాల్ వర్మ కీరవాణితో చేసిన ఒక స్పెషల్ చిప్ చాట్ లో కీరవాణి నాటు నాటు సాంగు గురించి తన మనసులో మాట చెప్పాడు. రాంగోపాల్ వర్మ తనదైన విచిత్రపు స్టైల్ లో ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్ లో రకరకాల ప్రశ్నలు వేశాడు. దీనికి సంబంధించి ఇంతకు ముందు వచ్చిన ప్రోమో ఇంటర్వ్యూ పై చాలా ఆసక్తి కలిగించింది. ఇప్పుడు ఫుల్ ఎపిసోడ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.
నాటు నాటు (Naatu Naatu) సాంగుకు మీరు కాకుండా ఇంకెవరైనా మ్యూజిక్ డైరెక్టర్ పని చేసి ఉన్నట్లయితే ఆ పాట ఆస్కార్ పొందే అర్హత ఉందని ఫీలయ్యేవారా అని ఆర్జీవి కీరవాణిని అడిగాడు. నానికి కీరవాణి (Keeravani) నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడానికి కారణాలు చాలా ఉన్నాయని కేవలం పాటగా తీసుకుంటే మాత్రం ఆస్కార్ వచ్చినందుకు తాను ఫీల్ అవ్వను అని అన్నారు. ఇంతకుముందు జయహో శాంతి ఆస్కారం వచ్చినప్పుడు కూడా తాను ఫీల్ అవ్వలేదు అని కీరవాణి అన్నారు.
తిరిగి ఆర్జీవి నాటు నాటు సాంగ్ మీ కెరియర్ టాప్ 100 సాంగ్స్ లో (100 songs) ఉందా అని కీరవాణిని ప్రశ్నించగా దానికి అతను ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏదైనా పాట క్రియేట్ చేసినప్పుడు అవతల వాళ్ళకి నచ్చాలని మనం చేయాలి కానీ అందరికంటే ముందు ఆ పాట మనకు నచ్చాలి. నాకే నచ్చకపోతే అది ప్రపంచానికి నచ్చుతుందని నేను ఎలా అనుకుంటాను…కొన్నిసార్లు నాకు నచ్చాలి అనుకుంటాను మరికొన్నిసార్లు అవతల వాళ్ళకి నచ్చే విధంగా ఉంటే చాలు అనుకుంటాను…అది మన చేతిలో ఉండదు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది అని కీరవాణి అన్నారు.
ఇక ఆస్కార్ విషయానికి వస్తే కమిటీలో ఓటు వేసే వాళ్ళు దాదాపు పదివేల మంది వరకు ఉన్నారు. వీరంతా ఆస్కారి ఎంట్రీ కి వచ్చిన అన్ని సినిమాలను చూస్తారు అన్న గ్యారంటీ లేదు కొన్నిటిని వదిలేసే అవకాశం కూడా ఉంది. మా సినిమా చూసి ఓటేయండి అని మనమే అక్కడ ప్రచారం చేయాల్సి వస్తుంది. అలా వాళ్ళు ఆర్ఆర్ఆర్ మూవీ చూసినప్పుడు కథలో క్రమంగా నేనంవ్వడం నాటు నాటు సాంగ్ వచ్చేసరికి మంచి ఊపున స్టెప్స్ వేస్తూ చప్పట్లు కొట్టి దాన్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది.
ఒక రకంగా చెప్పాలి అంటే సినిమా ఇంపాక్ట్ మొత్తం ఆ సాంగ్ మీద ఉంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి చాలామంది ఆ పాటకు ఓటు వేశారని నేను నమ్ముతున్నాను అని కీరవాణి అన్నారు. అంటే కీరవాణి పరోక్షంగా నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చేసి సీన్ లేదు అన్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది.ఇంటర్వ్యూలో కీరవాణి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.