జనవరి లో కీర్తీ సురేష్ మొదటి తెలుగు సినిమా

0
268
జనవరి లో కీర్తీ సురేష్ మొదటి తెలుగు సినిమా
జనవరి లో కీర్తీ సురేష్ మొదటి తెలుగు సినిమా

రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కీర్తీ సురేష్ పరిచయం అయింది. అయితే కీర్తీ మొదటి తెలుగు సినిమా పేరు చెప్ప మంటే అందరూ టక్కున నేనూ శైలజా అనే చెప్తారు. కానీ ఈ అమ్మడి మొదటి తెలుగు సినిమా నేనూ శైలజా కాదు. అంతకు ముందే తెలుగులో ఓ సినిమాను పూర్తి చేసింది. కారీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల అవ్వలేదు. ఈ సినిమాలో నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కథానాయకుడిగా చేయగా, కీర్తీ హీరోయిన్‌గా చేశారు. అప్పట్లో ఈ సినిమా విడుదల వరకూ వచ్చి అక్కడే నిలిచిపోయింది.

ఆ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన కీర్తీ ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పడు ఆ సినిమా విడుదల చేస్తే కీర్తీ అభిమానుల వల్ల మంచి బిజినెస్ అవుతుందని అనుకుంటున్నారు. దీంతో కొన్ని నెలల క్రితం ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించింది కాస్త షూటింగ్ మిగిలి ఉంటే దానిని పూర్తి చేసి విడుదల చేశారు.

ఈ సినిమాకు మొదట‘అయినా ఇష్టం నువ్వు’ అనే పేరు పెట్టారు. ఆతరువాత దానిని రెండు జడల సీతగా మార్చారు. ఈ టైటిల్ క్యాచీ ఉండటం, హీరోయిన్ కేంద్రంగా నడిచే కథగా ఉండటంతో కీర్తీ ఫేమ్‌ వాడుకుంటూ పబ్లిసిలీ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ సారైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనేది చూడాలి. థియేటర్లు తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో వచ్చే నెలలో సీనిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కీర్తీ సురేష్ సినిమాగా ప్రమోట్ చేస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆసక్తి చూపుతారు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందనేది వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here