Keerthy Suresh new birthday poster form Good Luck sakhi.

Keerthy Suresh Good Luck sakhi: ‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు కీర్తి సురేష్‌. చక్కటి రూపం, హావభావాలు కీర్తి సొంతం. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోతూ తన నటనతో పాత్రకు ప్రాణం పోసే కీర్తిసురేశ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ”గుడ్ లక్ సఖి’. నేడు(అక్టోబర్ 17) కీర్తి సురేష్ బర్త్ డే సంధర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు.

‘మహానటి’ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ”గుడ్ లక్ సఖి”. ఆది పినిశెట్టి – జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. ‘లక్ష్మి’ ‘ధనిక్’ వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇది.  ఓ గ్రామీణ యువతి అంతర్జాతీయ షూటర్ గా ఎలా మారిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన పాట, టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. వచ్చేనెలలో ఈ సినిమా విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.