కీర్తి సురేష్‌కు నో చెప్పిన మహేష్..!

0
335
Keerthy Suresh Missed Mahesh Babu's Sarkaru Vaari Paata Offer

Mahesh Babu -Keerthy Suresh: మహేష్ సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి.. పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా రూపొందనున్న ‘సర్కారు వారి పాట’ నుంచి కీర్తి సురేష్‌ని తప్పించారని తెలుస్తోంది. ఆమె స్థానంలో ముంబై హీరోయిన్‌ని సెలెక్ట్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.

Mahesh Babu Sarkaru Vaari Paata Latest updates

మహేష్ సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి.. పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించడంతో ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది ప్రేక్షకలోకం. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుందని మొన్నటి దాకా టాక్ నడిచింది. అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు కీర్తి సురేష్‌ను పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి కీర్తిని ఎందుకు పక్కనబెట్టారనేది మాత్రం తెలియరాలేదు.

ఈ చిత్రం లో కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. పక్కా ప్లాన్ తో షూటింగ్ ను మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కూడా కీలకం కావడం తో, ప్రస్తుతం ఈ పాత్ర పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి మహేష్ సరసన నటించే ఆ లక్కీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Previous articleOfficial Confirmation of Heroines in Nithin Andhadhun Remake
Next articleKeerthy Suresh Missed Mahesh Babu’s Sarkaru Vaari Paata Offer