ఆదిపురుష్ సీత పాత్రలో కీర్తి సురేష్ ..?

204
keerthy-suresh-to-play-sita-character-in-Prabhas-adipurush
keerthy-suresh-to-play-sita-character-in-Prabhas-adipurush

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే చాలు అందరి కళ్లు అటే చూస్తాయి. ప్రభాస్ కూడా అదే రేంజ్‌లో సినిమాలను ఎంచుకుంటున్నారు.

 

 

ప్రస్తుతం ప్రభాస్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సలార్ సినిమా చేస్తూనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినీ ప్రేమికులందరూ కూడా ఈ రెండు సినిమాల అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆదిపురుష్ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

 

 

ఇందులో బాలీవుడ్ అగ్రహీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. ఇక మరో ముఖ్య పాత్ర సీతగా కృతిసనన్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ పాత్రకు మరో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది. అమె ఎవరో కాదండీ..

 

 

మహానటి సినిమాతో మహానటిగా పేరుతెచ్చుకున్న కీర్తి సురేష్. తన అందం, అబినయంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆదిపురుష్ సీత పాత్రకు కీర్తి పేరు వినిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ లేదు. త్వరలోనే ఈ వార్తపై క్లారిటీ వస్తుందని టాక్ వస్తుంది.