జానకిరామ్: కీర్తి సురేష్ మొదటి సినిమా విడుదలకు సిద్ధం

Keerthy Suresh First Movie Janakiram : టాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ తెలీని వాళ్ళు ఎవరూ ఉండరు, మహానటి సినిమా తో కీర్తి సురేష్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లిస్టులో అగ్ర స్థానం లోకి వెళ్ళింది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే కీర్తి సురేష్ మొదటి సినిమా ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు.

ఇప్పుడు ఆ సినిమా మేకర్స్ సెన్సార్ కంప్లీట్ చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు, కీర్తి సురేష్‌, న‌వీన్ కృష్ణ జంట‌గా రూపొందిన చిత్రం `జానకిరామ్` (Janakiram). బేబీ శ్రేయారెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ఓబులేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రాంప్ర‌సాద్ ర‌గుతు ద‌ర్శ‌క‌త్వంలో త‌మ‌టం కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రం ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. కృష్ణ వంశీ గారి లాంటి పెద్ద ద‌ర్శ‌కుల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన రాంప్ర‌సాద్ రగుతు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఇందులో స‌ప్త‌గిరి, పోసాని, రాహుల్ దేవ్ , ర‌ఘు కారుమంచి ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల్లో న‌టించారు.

మ‌రో ఇంపార్టెంట్ రోల్ లో చాందిని న‌టించింది. త్వ‌ర‌లో సినిమా విడ‌దుల తేదీ ప్ర‌క‌టిస్తాం అని నిర్మాత త‌మ‌టం కుమార్ రెడ్డి మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది.

Related Articles

Telugu Articles

Movie Articles