Telugu Movie Review, High Court sensational comments on movie reviews, High Court comments on cinema reviews and ratings, Tollywood movie reviews,
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా సినిమాకు సంబంధించిన రివ్యూస్ రాయటం సర్వసాధారణం. కొంతమంది రాసే రివ్యూల మీద సినిమాకి బాగానే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మరి కొంతమంది కావాలనే సినిమా మీద బురద చెల్లటానికి రివ్యూలు రాస్తా ఉంటారు.. అలాగే యూట్యూబ్లో కూడా తమ విశ్లేషణని వ్యక్తం చేస్తూ ఉంటారు.. అయితే వీటి మీద హైకోర్టు ఈరోజు కీలకమైన తీర్పు ఇవ్వటం జరిగింది.
కేరళ సినిమా అయినా రోమాలింటే అద్యతే ప్రాణాయం సినిమా దర్శకుడు ముబీన్ రుయాఫ్ ఈ సినిమా రివ్యూ గురించి అని హైకోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. తను నమోదు చేసిన కేసులో చూస్తే సినిమా విడుదలైన తర్వాత వారం రోజులు పాటు ఎటువంటి అసభ్యకరమైన అలాగే సినిమాని కించపరిచే విధంగా రివ్యూలు రాయకూడదంటూ ఈ పిటిషన్ లో తను పేర్కొనడం జరిగింది. అయితే కేసు మీద వాదనలు విన్న తర్వాత హైకోర్టు ధర్మాసనం కీలకమైన తీర్పు ఇచ్చారు.
హైకోర్టు తీర్పు ప్రకారం “సినిమా పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా ఉన్న రివ్యూలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేరళ పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది.” సినిమా చూడకుండా లేదంటే చూసిన తర్వాత సరే సినిమా బాగాలేదు అలాగే నాకు నచ్చలేదు అంటూ రాసి రివ్యూల మీద సరైన దృష్టి పెట్టాలని కూడా చెప్పడం జరిగింది.
అయితే ఈ తీర్పు మీద కేరళకు సంబంధించిన దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేసి.. సినిమా మీద నిర్మాత్మక విమర్శలు అలాగే అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పు లేదని.. కానీ సినిమాని నాశనం చేసే విధంగా కొంతమంది కావాలనే రివ్యూ రాస్తా ఉంటారని వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష అనేది పడాలని వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు.. ఇప్పుడు ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి రాబోయే రోజుల్లో ఈ తీర్పు మీద ఎటువంటి చర్చ జరుగుతున్న వేచి చూడాలి.