“కేజీఎఫ్ చాప్టర్ 2” లో ప్రకాష్ రాజ్ పాత్ర డీటైల్స్

0
293
KGF Chapter 2 shoot resumes Prakash Raj to play a key role in Yash film

సౌత్ ఇండియా ఇండస్ట్రీ ని షేక్ చేసిన కేజీఎఫ్ చాప్టర్ 1 కి కొనసాగింపు గా వస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోవిడ్ 19 విలయం కొనసాగుతుంటే జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో రోడ్లపై తిరగాల్సిన పరిస్థితి ఉంటేనే వేలాది కేసులు చుట్టుముడుతున్నాయి.అలాగే ఇటు స్టేట్స్ అటు కేంద్రం నుంచి షూటింగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నియమనిబంధనల్ని అమలు చేస్తూ పని చేయొచ్చని ప్రకటించేశాయి.

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్, నేటి నుండి మళ్లీ ప్రారంభం అయింది. ఈ చిత్రం పై ఇప్పటికే సర్వత్రా చర్చ జరుగుతుండగా, ప్రకాష్ రాజ్ పాత్ర అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నేటి నుంచి కేజీయఫ్ సెట్ లో ప్రకాశ్ రాజ్ సహా కీలక పాత్రధారులపై చిత్రీకరణ సాగుతోంది. అందుకు సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్ ఎటువంటి పాత్ర చేస్తున్నారు అనే దాని పై ఆసక్తి కర చర్చ మొదలు అయింది. మొదటి భాగం లో కీలక పాత్ర పోషించిన అనంత నాగ్ పాత్ర లో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు అని కొందరు చెబుతుండగా, మరి కొందరు మాత్రం ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు అని అంటున్నారు. మరి ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Previous articleRhea Chakraborty in touch with ‘drug dealers’, reveal leaked WhatsApp chats
Next articlePrakash Raj joins the set of the Yash-starrer KGF: Chapter 2