రావు రమేష్‌కు బంపరాఫర్.. క్రేజీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర..!

KGF Chapter 2 Yash starrer's makers welcome Rao Ramesh
KGF Chapter 2 Yash starrer's makers welcome Rao Ramesh

(KGF: Chapter 2: Yash starrer’s makers welcome Rao Ramesh.. prashanth neel welcomes shooting of Yash KGF Chapter 2)భారత సినిమా ఇండస్ట్రీని ఒక్క ఊపు ఊపిన సినిమా కెజిఎఫ్. కన్నడలో తెరకెక్కిన ఈ మూవీ మిగతా అన్ని భాషల్లో డబ్ అయ్యి భారీ విజయం సాధించడమే కాదు కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. తొలి భాగం కంటే రెండో పార్ట్‌ కోసం ఎక్కువ కష్టపడుతుంది చిత్ర యూనిట్.

టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరొందిన రావు రమేష్ బంపరాఫర్ కొట్టేశారు. క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న కేజీఎఫ్‌ 2లో రావు రమేష్‌ నటించబోతున్నారు. ఓ కీలక పాత్రలో ఆయన కనిపిస్తుండగా ఈ రోజు ఆ మూవీ షూటింగ్‌లో అడుగెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ”రావు రమేష్‌ గారికి స్వాగతం. ఇందులో మీ పాత్ర గురించి ఊహాగానాలు ప్రేక్షకులకే వదిలేస్తున్నా. మిమ్మల్ని తెరపై చూసిన తరువాత వారికి తెలుస్తుంది. కేజీఎఫ్‌ 2లో మీరు భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది” ట్వీట్ చేశారు.

ఈ షెడ్యూల్ పూర్తి కాగానే ఆఖరి షెడ్యూల్ ను హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుపెడతారట. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో కొంత భాగం షూట్ చేయగా..సినిమాలోని ఆఖరి సన్నివేశాలను ఇక్కడే షూట్ చేసి సినిమాకు గుమ్మడి కాయ కొట్టబోతున్నట్లు సమాచారం. ఈ సెకండ్ పార్ట్ మొదటి భాగం కన్నా ఇంకా హెవీ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుందని, వరల్డ్ మాఫియాను భారీ స్థాయిలో చూపించడం జరుగుతుందని అన్నారు. ఈ ఏడాది జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ సీక్వెల్‌పై కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీలో భారీ అంచనాలు ఉన్నాయి.