కేజీఎఫ్2 రిలీజ్ డేట్

0
148
kgf2-release-date-announcement-today-evening
kgf2-release-date-announcement-today-evening

ప్రస్తుతం దేశంలోని సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నా సినిమాల్లో కేజీఎఫ్2 కూడా ఒకటి. యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే కేజీఎఫ్2 టీం అభిమానులకు ఓ తీపికబురు అందించేందుకు సిద్దమవుతుంది. ఈ సినిమా విడుదల తేదీని ఈరోజు ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట తప్పమంటూ హంబోలే ఫిలింస్ ట్వీట్ చేశారు.

ఈరోజు సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఈ సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ రికార్డులను తిరగ రాసింది. అభిమానుల్లో ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను రాకీ భాయ్ ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.