kiara advani and Sidharth Malhotra wedding photos: కియారా-సిద్ధార్థ్ రిలేషన్షిప్ మీద చాలా రూమర్లే వచ్చాయి. కానీ చివరికి ఇద్దరు పెళ్లి అని అనుబంధంతో ఒకటయ్యారు. కియారా-సిద్ధార్థ్ నిన్న రాజస్థాన్ లోని జైసల్మీర్ సమీపంలో ఉన్న సూర్య ఘడ్ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వివాహానికి అతి తక్కువ సన్నిహేతులతోనే జరుపుకున్నారు జంట.
kiara advani and Sidharth Malhotra wedding photos: కియారా-సిద్ధార్థ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెళ్లిని కన్ఫామ్ చేస్తూ సిద్దార్థ్ మల్హోత్రా ఫోటోల్ని తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడం జరిగింది. అలాగే ‘ఇప్పుడు మా పర్మినెంట్ బుకింగ్ పూర్తయ్యింది. మా కొత్త ప్రయాణం కోసం మీ దీవెనలు, మీ ప్రేమ కావాలి’ అంటూ క్యాప్షన్ పెట్టారు.
పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ సెలబ్రిటీస్ అలాగే స్నేహితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కియారా-సిద్ధార్థ్ ఇద్దరూ ఈరోజు ప్రైవేట్ జెట్ లో జైసల్మీర్ నుంచి ఢిల్లీలో ఉన్న సిద్దార్థ్ ఇంటికి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 9న రిసెప్షన్ ఉంటుందని అయితే దీనికి అందర్నీ పిలుస్తున్నట్టు చెప్పుకోవచ్చారు అలాగే ఫిబ్రవరి 10న ముంబైలో సినీ సెలబ్రిటీస్ అందరికీ ప్రత్యేకమైన రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది.

