Kiara Advani Hasina Pagal Deewani song copy from Ravi Teja Idiot chupultho guchi guchi champake song

Ravi Teja Kiara Advani: భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత వినయ విధేయ రామతో ఇక్కడే సెటిల్ అయిపోతుందేమో అనిపించింది కియారా అద్వానీ. కైరా అద్వానీ లేటెస్ట్ మూవీ ‘ఇందూకి జవానీ’. (Hasina Pagal Deewani song) లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అభీర్‌సేన్‌ గుప్తా డైరెక్ట్‌ చేస్తున్నారు. మికా సింగ్‌ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను బుధవారం చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

‘హసీనా పాగల్ దివాని..’ అంటూ సాగే ఈ పెప్పీ సాంగ్ చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే పాటకు రీమిక్స్ వర్షన్. మన పాటను అక్కడ తీసుకుని వాయించేసుకున్నారంతే. ఇప్పటికే మన పాటలు చాలా వరకు హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇడియట్ పాటను కూడా కాపీ కొట్టేసారు. షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ రాయగా.. మికా సింగ్, ఆషీష్ కౌర్ పాడారు. ఈ సాంగ్‌ బాలీవుడ్‌ సినీ ప్రేక్షకులకు కొత్తగా ఉందేమో కానీ.. టాలీవుడ్‌ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు..

ఈ సాంగ్‌ విన్న టాలీవుడ్‌ సినీ జనాలు.. ఇప్పుడు టాలీవుడ్‌ కంటెంట్‌పై ఆధాపడుతున్న బాలీవుడ్‌‌కు.. ట్యూన్స్‌ విషయంలోనూ టాలీవుడ్‌పైనే డిపెండ్‌ కావాలా? అంటూ కాముంట్స్ చేస్తున్నారు. రింగ రింగ, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు లాంటి పాటలను కూడా ఇప్పటికే బాలీవుడ్‌లో కాపీ చేసారు. ఇప్పుడు ఇడియట్ పాట వంతు.