Kichcha Sudeepa Pehlwaan Telugu Official Trailer Talk
Kichcha Sudeepa Pehlwaan Telugu Official Trailer Talk

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న సినిమా పహిల్వాన్…KGF ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమాని కూడా పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు.ఈగ,బాహుబలి…ఇప్పుడు సైరా సినిమాల్లో నటించిన సుదీప్ కి నేషనల్ లెవెల్ లో గుర్తింపు ఉంది.పైగా ఇప్పుడు దబాంగ్-3 లో కూడా విలన్ గా నటిస్తున్నాడు.వీటన్నిటిని వాడుకుంటూ ఈ సినిమాని పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ చెయ్యబోతున్నారు.ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.

ఈ వయసులో కూడా సుదీప్ తన పాత్ర పెర్ఫెక్షన్ కోసం బాడీ బిల్డింగ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.కాకపోతే ట్రైలర్ లో అంతగా ఎక్సైట్ చేసే అంశాలు ఏమీ కనిపించలేదు.అలానే మాటల్లో కూడా పెద్ద హై కనిపించలేదు.గతంలో మనం చూసిన భద్రాచలం,సుల్తాన్ ఛాయలే ఎక్కువగా కనిపించాయి.అయితే సుదీప్ ఒక సినిమా ఒప్పుకుంటే అందులో కథ,ఆ కథలో ఎదో ఒక మంచి పాయింట్ ఉంటే తప్ప సినిమా ఒప్పుకోడు.పైగా ఈ సినిమాని తెలుగులో వారాహి చలనచిత్రం రిలీజ్ చేస్తన్నారు అంటే సినిమాలో ఎదో మ్యాటర్ ఉంది ఉండాలి.అది ఏంటి అనేది సినిమా రిలీజ్ అయ్యాక మాత్రమే తెలుస్తుంది.ప్రస్తుతానికి అయితే ఊహించినంత హైప్ లేని పహిల్వాన్ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడు అనేది చూడాలి.