ఆచార్యలో కీలక పాత్ర వెయ్యబోతున్న కిచ్చ సుదీప్

0
99
kichha-sudeep-to-act-in-chiranjeevi-acharya
kichha-sudeep-to-act-in-chiranjeevi-acharya

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ధర్మస్థలి దేవాలయం సెట్‌ను భారీగా వేయించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈ సెట్‌లోనే శరవేగంగా సాగుతుంది. అయితే జనవరి29న విడుదలైన ఆచార్య టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 

 

అతి త్వరలో చిరు, చరణ్‌లపై మారెడుమిల్లి అడవిలో కొన్ని కీలక సన్నివేశాలను చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని, అందులో మరో స్టార్ హీరో చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆ పాత్రకు కిచ్చ సుదీప్‌ని చిరు రికమెండ్ చేశారని కూడా టాక్ వస్తుంది.

 

 

ఇది ఇంకా చర్చల దశలో ఉందంట. మరి ఈ అవకాశాన్ని సుదీప్ ఓకే చేస్తారో లేదో చూడాలి. అయితే ఇదివరకే కిచ్చ సుదీప్ తెలుగులోని కొన్ని పాత్రలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. మరి ఈ సినిమాలో కూడా సుదీప్ కనిపిస్తారేమో చూడాలి. అయితే ఈ సినిమా మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.