కింగ్ నాగార్జున‌, ప్ర‌వీణ్ స‌త్తారు `ఘోస్ట్` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌.

0
2097
King Nagarjuna and Praveen Sattaru film The Ghost First Look poster Out

Nagarjuna Ghost: కింగ్ అక్కినేని నాగార్జునకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి `ది ఘోస్ట్`(The Ghost) అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను ప్ర‌క‌టించారు.

ఘోస్ట్ అనేది ఈ సినిమాకి తగిన టైటిల్ అని చిత్రబృందం తెలిపింది. లండన్‌లో అద్భుతమైన బిగ్ బెన్ కూడా రాత్రిపూట పోస్టర్ లో భయపెట్టేంత భీకరంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో నాగ్ స‌ర‌స‌న కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP -నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప‌తాకాల‌పై నారాయణ్ దాస్ కె నారంగ్- పుస్కూర్ రామ్ మోహన్ రావు .. శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో నాగార్జున క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుంది అనే విష‌యాన్ని మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా చూపించారు మేక‌ర్స్‌.మీరు అతన్ని చంపలేరు… మీరు అతని నుండి పారిపోలేరు … మీరు అతనితో చర్చలు జరపలేరు… కేవ‌లం మీరు దయ కోసం మాత్రమే వేడుకోవచ్చు …” అయినప్పటికీ నో మెర్సీ, క్యాప్షన్ ని జోడించారు. మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లైవ్లీగా ఉంది.

King Nagarjuna The Ghost First Look poster

గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ స‌హా ప్రధాన తారాగణం పాల్గొంటోంది. ముఖేష్ జి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా..బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. రాబిన్ సుబ్బు నభా మాస్టర్ స్టంట్స్ అందిస్తున్నారు.

Previous articleఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తి..!
Next articleKing Nagarjuna The Ghost First Look Out