`క‌ప‌ట‌ధారి` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నాగార్జున‌

0
155
king Nagarjuna chief guest for sumanth kapatadhaari pre release event

`సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడు సుమంత్ లేటెస్ట్ మూవీ `క‌ప‌ట‌ధారి`. డిఫ‌రెంట్ క‌థా చిత్రాలు, విభిన్న‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో సుమంత్ మ‌రో వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్న క‌ప‌ట‌ధారి చిత్రం ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌ల కానుంది. రీసెంట్‌గా స‌మంత అక్కినేని విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై క్రియేట్ అయిన అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా ఫిబ్ర‌వ‌రి 16న జ‌ర‌గ‌బోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్నారు.

క‌న్న‌డ చిత్రం `కావ‌లుధారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. రీసెంట్‌గా త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్పుడు తెలుగులో సంద‌డి చేయ‌డానికి `క‌ప‌ట‌ధారి`గా ముందుకు రానుంది. ఓ ట్రాఫిక్ ఇన్సెపెక్ట‌ర్ ఓ హ‌త్య కేసును ఎలా చేధించాడు అనే క‌థాంశంతో సినిమా రూపొందింద‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. దీంతో సుమంత్ పాత్ర‌ను ఎలా క్యారీ చేశారోన‌ని ఆస‌క్తితో అంద‌రిలో ఏర్ప‌డింది. ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై కపటధారి చిత్రాన్ని డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు.

Nagarjuna to grace 'Kapatadhaari' pre-release event

 

Previous articleశ్రీవిష్ణు హీరోగా అర్జున ఫ‌ల్గుణ టైటిల్ పోస్టర్ విడుదల
Next articleTamil Actor Vishal Chakra Movie Posters