Allu Arjun Trivikram Ala VaikuntapuramMovie, AA19 Title
Kirak Title For Allu Arjun Trivikram Movie, AA19 Title

త్రివిక్రమ్ సినిమాలు మాత్రమే కాదు అతని సినిమాల టైటిల్స్ కూడా వెరైటీ గా ఉంటాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి మాసివ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోకి అత్తారింటికి దారేది అనే టైటిల్ కనీసం ఊహించడానికి కూడా ఎవ్వరూ సాహసించరు.కానీ త్రివిక్రమ్ మాత్రం అదే టైటిల్ పెట్టి ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

అలాగే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమాకి అరవింద సమేత అనే హీరోయిన్ ఒరింటెడ్ ఫీల్ ఉండే టైటిల్ పెట్టాడు.సినిమాలో మ్యాటర్ ఉంటే టైటిల్ కూడా కనెక్ట్ అయిపోతుంది అని నమ్మే త్రివిక్రమ్ బన్నీ తో చేస్తున్న హ్యాట్రిక్ మూవీ కోసం వైకుంఠపురంలో అనే వెరైటీ టైటిల్ అనుకున్నాడు.ఈ లీక్ గీత కాంపౌండ్ నుండే వచ్చింది.అలాగే ఆ లీక్ కి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది.అందుకే బన్నీ సినిమాకి అదే టైటిల్ ఫిక్స్ అవ్వడం దాదాపుగా ఖాయం.టైటిల్ ప్రకారం చూసుకున్నా కూడా వైకుంఠపాళీ ఆటలో ఉన్న సరదా,సస్పెన్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి అని కూడా అర్ధం వచ్చేలా ఈ పేరుని అనుకుని ఉండొచ్చు.అసలు విషయం ఏంటి అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.