Dilruba Postponed – New Release date: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న తాజా చిత్రం దిల్‌రూబా (Dilruba) థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాని ఫిబ్రవరి 14న విడుదల చేయుటకు మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది.. ప్రమోషన్ల భాగంగా టీజర్ అలాగే సాంగ్స్ ని విడుదల చేశారు..
దిల్‌రూబా (Dilruba) సినిమాని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ముందుగా ప్రకటించినా, అనుకోని కారణాల వల్ల రిలీజ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో కొత్త విడుదల తేదీపై ప్రేక్షకుల్లో ఉత్సుకత నెలకొంది. అయితే అందుతున్న సమాచారం మేరకు విడుదలైన సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఎటువంటి బజ్ క్రియేట్ చేయకపోవడంతో అలాగే సినిమాలో కంటెంట్ కూడా చేంజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది..
తాజా సమాచారం Dilruba మేరకు, మేకర్స్ ఇప్పుడు మార్చి 14న (March 14th) సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రుక్సర్ ఢిల్లోన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈసారైనా విడుదల చేసే కంటెంట్ సినిమాపై హైపు తీసుకువస్తుందో లేదో చూడాలి..