Bigg Boss Telugu 7 Today Elimination: బిగ్ బాస్ తెలుగు 7 షో మొదలయ్యి దాదాపు ఆరు రోజులు గడుస్తుంది. హౌస్ లోకి 14 మంది హౌస్ మేట్స్ వెళ్లగా ఇప్పుడు దానిలో 8 ఎలిమినేషన్ లో ఉన్నారు. ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాబోతున్నారనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని షోలకి ఇప్పుడు మొదలైన ఈ బిగ్ బాస్ షో కి చాలా తేడా ఉంది అంటూ నాగార్జున చెప్పడం జరిగింది.. అయితే ఈ మొదటి వారం ఎలిమినేషన్ లేదు అంటూ కథనాలు అయితే నడుస్తున్నాయి మరి ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి వారంలో కిరణ్ రాథోడ్, షకీలా, గౌతం కృష్ణ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ఫ్యాన్ పేజీల్లో సమాచారం అందుతోంది. కానీ అందుతున్న సమాచారం మేరకు బిగ్ బాస్ 7 తెలుగు మొదటివారం ఎలిమినేషన్ లో హౌస్ మేట్స్ కి ఓటింగ్ ప్రకారం అందరికన్నా తక్కువ వచ్చింది కిరణ్ రాథోడ్. లేటెస్ట్ గా విడుదలైన ప్రోమోలో ఎలిమినేషన్ అయినట్టే చూపించారు. మరి కిరణ్ రాథోడ్ ఈరోజు ఎలిమినేట్ అయ్యారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
షో మొదలైనప్పుడు హౌస్ లోకి వెళుతున్న ఏ నెంబరు ఇంకా కన్ఫామ్ కాలేదు అంటూ నాగార్జున చెప్పడం జరిగింది. ఈవారం ఇంకా హౌస్మేట్స్ గా ప్రమోషన్ కూడా అందుకోకుండా ఎలా ఎలిమినేట్ అవుతారన్న అనుమానాలు జనాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇక అసలు విషయం తెలియాలంటే ఈరోజు బిగ్ బాసు షో మొదలైన తర్వాతే తెలుస్తుంది.