మళ్లీ తండ్రయిన హీరో కార్తి…!

239
kollywood hero karthi blessed with baby boy

hero karthi: కార్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సూర్య తమ్ముడుగా ఇక్కడికి వచ్చిన ఈయన.. కార్తి అన్న సూర్య అనే స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు సూర్య తమ్ముడుగా ఇక్కడికి వచ్చిన ఈయన.. కార్తి అన్న సూర్య అనే స్థాయికి ఎదిగాడు. హీరో కార్తి మరోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య రంజని మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు.

ఈ విషయాన్ని కార్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘మాకు మగబిడ్డ పుట్టాడు. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులకు థ్యాంక్స్ చెప్పడం ఎంత మాత్రం సరిపోదు. మా బాబుకు మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్యు గాడ్’ అని పోస్ట్ చేశారు. తమ్ముడి ట్వీట్‌కి హీరో సూర్య స్పందించారు. డాక్టర్ నిర్మలా శంకర్, ఆమె టీమ్‌కి మరోసారి థ్యాంక్స్ అంటూ కామెంట్ పెట్టారు.

2011లో రంజనీని పెళ్లి చేసుకున్నాడు కార్తి. ఈ జంటకు 2013లో అమ్మాయి పుట్టింది. ఏడేళ్ళ తర్వాత మరోసారి ఈయన తండ్రి అయ్యాడు. ఈ విషయం తెలిసిన వెంటనే సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియాలో కార్తికి కంగ్రాట్స్ చెబుతున్నారు.