Kollywood Hero Vijay Master Teaser Becomes Most Liked Teaser In India

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా కూడా ఇలాయదలపతి విజయ్ కి ఉన్న క్రేజ్ మాత్రం చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. తెలుగులో కూడా విజయ్ కి ఇప్పుడిప్పుడే మార్కెట్ పెరుగుతోంది.

ఇక అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టీజర్ ని దీపావళి సందర్భంగా విడుదలైన ఈ టీజర్ సోషల్‌ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 24 గంటలు గడవకముందే ఏకంగా 16 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడంతో పాటు 1.7 మిలియన్ లైక్స్ సాధించి ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు 22 మిలియన్ వ్యూస్ దాటగా.. 1.9మిలియన్ లైకులతో ఎవరినీ అందని ఎత్తులో నిలిచింది ఈ టీజర్..సింగపూర్, శ్రీలంకలో కూడా విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ మరోసారి మాస్టర్ రుజువు చేసింది. అక్కడ కూడా టీజర్ నెంబర్ వన్ ట్రేండింగ్ లిస్ట్ లోకి వచ్చేసింది.

కార్తితో ‘ఖైదీ’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ అందుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ‘మాస్టర్’పై భారీ అంచనాలున్నాయి. అసలైతే సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ మధ్య విజయ్ నటించిన సినిమాలన్నీ వరుసగా వందల కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపుతున్నాయి. దీంతో లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో నేరుగా విడుదలవుతున్న ‘మాస్టర్’తో విజయ్ రికార్డు కలెక్షన్లు రాబట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హంగామా చేస్తున్నారు. ఇందులో విజయ్ సరసన మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండటం విశేషం.