అనుష్కను ఊహించని టార్చర్ కు గురిచేసిన నటుడు

Anushka Shetty next Nishabdham movie release date locked
Anushka Shetty next Nishabdham movie release date locked

(kona venkat shocking comments on michael madison, Anushka Shetty next Nishabdham movie release date and trailer details.. )హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మాడిసెన్ ను ఏరికోరి అనుష్క నటిస్తున్న ‘నిశ్శబ్దం’ మూవీలో నటింప చేసారు. ఈమూవీలో అతడు నటించినందుకు అతడికి భారీ పారితోషికం ఇవ్వడం కూడ జరిగింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని ఏప్రియల్ 2న విడుదల కాబోతున్న ఈమూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని కోన వెంకట్ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఒక షాకింగ్ సీక్రెట్ ను బయటపెట్టాడు.

ఊరు కాని ఊరులో… దేశం కాని దేశంలో… అనుష్క ‘నిశ్శబ్దం’ టీమ్‌కి ఓ నటుడు చుక్కలు చూపించాడు. ఓ మాట మాత్రమైనా చెప్పకుండా సెట్ నుండి గాయబ్ అయ్యాడు. అతడి ఫోనులు పని చేయవు. అతడెక్కడ ఉన్నాడో అతడి మేనేజర్‌కీ తెలియదు. చివరకు, ఒక ప్రయివేట్ డిటెక్టివ్ దగ్గరకు వెళ్లి, అతడికో పాతిక లక్షలు సమర్పించుకుని ఆ నటుడు ఎక్కడున్నాడో తెలుసుకున్నారట. ఇంతకీ, అనుష్క టీమ్‌ని అంత ఇబ్బంది పెట్టిన నటుడి పేరు ఏంటంటే… మైఖేల్ మ్యాడసన్. అసలు వివరాల్లోకి వెళితే…

Hollywood actor Michael Madsen as Richard Dickens in Nishabdham movie
Hollywood actor Michael Madsen as Richard Dickens in Nishabdham movie

ఈమూవీ షూటింగ్ గత సంవత్సరం జూలైలో అమెరికాలో జరుగుతున్నప్పుడు ఈమూవీలో నటిస్తున్న మైఖేల్ తమకు ఎవరికీ చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి సుమారు వారం రోజులు పెట్టిన టార్చర్ తాను జీవితంలో మరిచిపోను అంటూ కామెంట్ చేసాడు. అనుష్కతో ఒకరోజు కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసిన తరువాత మైఖేల్ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడని అతడి గురించి అతడి వ్యక్తిగత సహాయకులను అడిగినా తమకు తెలియదు అని చెప్పడంతో సినిమా షూటింగ్ మధ్యలో మిస్ అయిపోయిన ఈహాలీవుడ్ స్టార్ ను ఎలా పట్టుకోవాలో తెలియక ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ను ఆశ్రయించిన విషయాన్ని కోన వెంకట్ గుర్తుకు చేసుకున్నాడు.

చివరకు, ప్రయివేట్ డిటెక్టివ్ తో వెతికిస్తే కెనడాలో ఒక హోటల్ లో ఉన్నాడని తెలిసిందట. అక్కడ కూడా మూడు రోజులు హోటల్ రూమ్ డోర్స్ లాక్ చేసుకుని కూర్చున్నాడట. ఎలాగోలా అతడిని బతిమాలో, ఏదో చేసో షూటింగ్ పూర్తి చేశారట. అసలు అనుష్క వలన మైఖేల్ సమస్య ఏర్పడిందా లేదంటే మైఖేల్ తో అనుష్కకు సమస్య వచ్చిందా అన్నవిషయం మాత్రం క్లారిటీ లేదు..