Homeసినిమా వార్తలుDevara 2 Parts: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కొరటాల.!

Devara 2 Parts: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కొరటాల.!

Devara movie 2 parts, Devara 2 parts, Koratala Shiva confirmed NTR Devara 2 parts, Devara movie story, Jr NTR Devara movie, Devara shooting update, Devara Cast Crew, Devara part 1 release date

Devara movie 2 parts, Devara 2 parts, Koratala Shiva confirmed Devara 2 parts, Devara movie story, Jr NTR Devara movie, Devara shooting update, Devara Cast Crew, Devara part 1 release date

జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ రెండోసారి కలిసి చేస్తున్న సినిమా దేవర. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న దేవరాజ్ సినిమా ప్రస్తుతం షూటింగు హైదరాబాద్ లొకేషన్లో సర్వేగంగా జరుగుతుంది.  ఎన్టీఆర్ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు.  అయితే ఈరోజు దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇవ్వటం జరిగింది. . దేవరాజ్ సినిమా రెండు భాగాలుగా వస్తుందంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో దర్శకుడు విడుదల చేయడంతో ఇప్పుడు ఇది నేషనల్ న్యూస్ అయింది.  

దేవర సినిమాని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్టు ఈరోజు దర్శకుడు కొరటాల శివ అనౌన్స్ చేయడం జరిగింది. తీర ప్రాంతాలకు సంబంధించిన అలాగే అందరూ మర్చిపోయినా కథగా NTR నటిస్తున్న ఈ దేవరా సినిమాని రూపొందిస్తున్నట్లుగా చెప్పాడు. అయితే కథను మరింత వివరించేందుకు దేవర ని (Devara 2 parts) రెండు భాగాలుగా తీస్తున్నట్టు విడుదల చేసిన వీడియోలో వివరించడం జరిగింది. 

Jr NTR and Janhvi Kapoor starring Devara 2 parts confirmed

Koratala Siva మొదటి దగ్గర నుంచి చెబుతున్నట్టు కోస్టల్ ఏరియా లో జరిగే ఈ కథ లో జూనియర్ ఎన్టీఆర్ ఒక తెగకు చెందిన నాయకుడిగా కనిపిస్తాడు. తన వర్గానికి సంబంధించిన వారిని కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్తాడు అనే ఒక లీకైతే సినిమా వర్గాల నుండి తెలుస్తుంది.  దానితోపాటు ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ ఈ సినిమాలో యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఈ సినిమాలో 40% యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. 

ముఖ్యంగా ఈ యాక్షన్ సీన్స్ లో అండర్ వాటర్ ఫైట్ ఒకటి అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సంబంధించిన ఫైట్ కూడా సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని ఇండస్ట్రీలో టాక్  వినపడుతుంది. 

ఈ సినిమాలో బాలీవుడ్ కి సంబంధించిన సైఫ్ అలీ ఖాన్ అలాగే జాహ్నవి కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకి గాను మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.  అయితే మొదటిగా అనుకున్నట్టే ఏప్రిల్ 5న దేవర మొదటి భాగాన్ని విడుదల చేస్తున్నట్టు కొరటాల శివ తెలియజేశాడు..