Koratala Siva And Chiranjeevi Movie Heroine Fix, Latest Updates
Koratala Siva And Chiranjeevi Movie Heroine Fix, Latest Updates

చిరంజీవి తన డ్రీం ప్రాజెక్ట్ సైరా కి సంబందించిన తన వర్క్ మొత్తం పూర్తిచేసాడు.అయితే కొరటాల సినిమాకోసం మళ్ళీ వారియర్ లుక్ నుండి స్లిమ్ లుక్ కి మారుతున్నాడు.ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది.సైరా రిలీజ్ కంటే ముందే కొరటాల సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతుంది.స్క్రిప్ట్ మొత్తం లాక్ అయిపోవడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది.అయితే ఈ సినిమాలో నటించే విషయంలో మాత్రం చాలా పేర్లు వినిపించాయి.అనుష్క,నయనతార,తమన్నా,శృతి హాసన్..ఇలా రోజుకోపేరు తెరమీదకి వచ్చింది.సీనియర్ హీరోస్ కి హీరోయిన్స్ కొరత ఎంత పెద్ద ప్రాబ్లెమ్ అనేది మరొకసారి తెలిసొస్తుంది.

సైరా కి నయనతార హీరోయిన్ కాబట్టి లుక్ వరకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు.కానీ కొరటాల సినిమాకి మాత్రం క్యారెక్టర్ కి ఫిట్ అవుతూ,చిరు పక్కన సెట్ అయ్యే హీరోయిన్ కావాలి.అందుకే చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 లో బాస్ తో జతకట్టిన కాజల్ నే మళ్ళీ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా తీసుకున్నారు.కొరటాల కూడా జనతా గ్యారేజ్ లో ఒక పాట నిమిత్తం కాజల్ తో కలిసి వర్క్ చేసాడు.ఇక ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం వల్ల కూడా కాజల్ లక్కీ చార్మ్ అని ఫిక్స్ అయినట్టున్నారు.అందుకే మళ్ళీ కాజల్ కే పిలిచి మరీ ఈ ఆఫర్ ఇచ్చారు.అలాగే ప్రతీ సారీ ఫేడ్ అవుట్ అనుకున్న టైం లో కాజల్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది.మొత్తానికి మెగా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ మొదటి అడుగే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ తో స్టార్ట్ అయ్యింది.