తారక్ సినిమా కోసం కూడా బాలీవుడ్ స్టార్స్..?

0
199
Koratala Siva and Jr NTR lock Kiara Advani for NTR30

NTR-Koratala Siva Film: తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఎలాగు రాజమౌళి మార్క్ సినిమా కావడంతో ఎన్టీఆర్ కు ఇండియా లెవల్ లో పేరు దక్కడం ఖాయం. ఇదే పనిలో తన తర్వాత సినిమాలను కూడా తారక్ అదే స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల తో సినిమా చేస్తున్నాడు NTR30.

ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్‌లో ఇప్పటికే జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తో రాబోయే సినిమా NTR30 మీద భారీ అంచనాలే ఉన్నాయి. దానికి అనుగుణంగానే సినిమాలో కాస్టింగ్ ఎంపిక చేస్తున్నాడు. బీటౌన్ హీరోయిన్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందనే ఆలోచనలో ఉన్నాడట. బాలీవుడ్ లో కియారా అద్వానీ ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ బ్యూటీ. వరస భారీ ప్రాజెక్టులతో కియారా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

కియారా ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలను చేసింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తారక్ కోసం కియారాను తీసుకొస్తున్నాడట కొరటాల శివ. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కి అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా ఇందులో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీని ఫైనల్ చేసిన కొరటాల మరో హీరోయిన్ గా కొత్త హీరోయిన్ సాయీ మంజ్రేకర్‌ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.

అయితే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండనుందని కొందరు అంటుంటే మరికొంతమంది మాత్రం సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందిస్తున్నారని అంటున్నారు.