ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో NTR 30 మోష‌న్ పోస్టర్ విడుదల

రేపు మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 ప్రీ టీజర్ ఈరోజు విడుదలైంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్టీఆర్ వాయిస్‌తో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలతో ప్రీ-టీజర్ ఓ సముద్రంలా సాగుతోంది. ఒక వ్యక్తి ఎప్పుడు అర్థం చేసుకోవాలో, అతను ధైర్యంగా ఉండటాన్ని ఎప్పుడు ఆపాలి మరియు అతను ఎప్పుడు భయపడాలి అనే దాని గురించి కొనసాగింది మోషన్ పోస్టర్.

వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో తెర‌కెక్కించే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఎన్టీఆర్ న‌టిస్తున్న 30వ చిత్ర‌మిది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యాన‌ర్స్‌పై మిక్కిలినేని సుధాక‌ర్, హ‌రికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్‌కు బ‌ర్త్ డే విషెష్ చెప్ప‌డానికి ..NTR 30కి సంబంధింధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అందులో ఎన్టీఆర్ త‌న‌దైన స్టైల్లో ప‌క్కా మాస్ డైలాగ్‌ను చెబుతున్నారు. ఆ డైలాగ్‌కు అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉండేలా మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. మొత్తానికి ఫ్యూరీ ఆఫ్ ఎన్టీఆర్ 30 ప్రీ-టీజర్ ఎన్టీఆర్ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉంది.

Jr NTR and Koratala Siva Next NTR 30 announcement poster
Jr NTR and Koratala Siva Next NTR 30 announcement poster

యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి సాబు సిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు విజువ‌ల్స్ అందిస్తున్న ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

 

Related Articles

Telugu Articles

Movie Articles