NTR30 మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌

0
1623
Koratala Siva and Jr NTR next NTR30 movie will be revenge drama
Koratala Siva and Jr NTR next NTR30 movie will be revenge drama

NTR, Koratala Siva, NTR30: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం ఈ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న రిలీజ్ అవుతుంది. అయితే ఎన్టీఆర్ కొరటాల సినిమా NTR30 పై అప్డేట్ ఒకటి వచ్చింది.

ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ ఇద్దరు కలిసి జనతా గ్యారేజ్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్లీ అదే కాంబినేషన్లో వస్తున్న NTR30 సినిమాపై ఫాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా కథా నేపథ్యం ఏమైఉంటుంది? ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనే విషయాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ (NTR) క్లారిటీ ఇచ్చాడు. “కొరటాల తో చేయబోయే సినిమా రివేంజ్ డ్రామా అని అలాగే ఫిబ్రవరి 2022 నుండి ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందని ఎన్టీఆర్ తెలిపారు”.

NTR30 movie shooting start from Feb 2022
NTR30 movie shooting start from Feb 2022

అలాగే తన తదుపరి సినిమా అయినా KGF డైరెక్టర్ ప్రశాంత్ డిసెంబర్ 2022 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పటం జరిగింది. ఇది ‘కేజీఎఫ్’ తరహాలో సాగే భారీ యాక్షన్ సినిమా” అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ దొరికినట్టు ఆనందంగా ఉన్నారు.

 

Web Title: Koratala Siva and Jr NTR movie will be revenge drama script, NTR30 shooting update, NTR30 story. NTRO film news.

Previous articleManasa Radhakrishnan Latest Stills
Next articleSpirit మూవీకి షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్..!