Kota Srinivasa Rao: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఏది నిజమో ఏది అబద్దమో చెప్పటం చాలా కష్టం అవుతుంది. వైరల్ న్యూస్ ముందుగా అందుతున్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా కానీ అది ఎంతవరకు నిజమా అనేది తెలియటం లేదు. ఇక సినిమా సెలబ్రిటీస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఏదో ఒక వార్త వైరల్ అవుతానే ఉంటుంది. అలాగే ఇప్పుడు కోటా శ్రీనివాసరావు చనిపోయినట్టు ఈరోజు ఉదయం నుండి న్యూస్ వైరల్ అయింది సోషల్ మీడియాలో.
అసలు విషయానికి వెళ్తే, లెజెండ్రీ యాక్టర్ కోటా శ్రీనివాసరావు కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని అలాగే ఈ రోజు ఉదయం మరణించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇది తెలుసుకున్న పోలీసులు ఇంటి దగ్గరకు వెళ్ళేటప్పటికి కోట బాగానే ఉన్నారు. పోలీసులు సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్ని వివరించగానే.. నటుడు వెంటనే వీడియోని విడుదల చేయడం జరిగింది.
విడుదల చేసిన వీడియోలో కోట మాట్లాడుతూ.. నేను కుటుంబ సభ్యులతో ఉండాలని అలాగే రేపు జరగబోయే ఉగాది సంబరాలు గురించి మాట్లాడుకుంటున్నామని.. ఇంతలోనే నాకు దాదాపు 50 ఫోన్ కాల్స్ చనిపోయానంటూ రావడం ఆశ్చర్యకరంగా ఉందని.. అలాగే మా ఇంటికి 10 మంది పోలీసులు బందోబస్తుకు వచ్చారు.. వాళ్లకు కూడా తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని అరికట్టాలంటూ రిక్వెస్ట్ చేయటం కూడా జరిగింది.. సోషల్ మీడియాలో వచ్చే కథనాలని ఎవరు నమ్మవద్దు అంటూ ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేశారు.
Legendary Actor #KotaSrinivasaRao garu confirmed visually that he is absolutely fine. Do not believe in any rumours. 🙏#Tollywood #Rumours pic.twitter.com/7Rs0q6CeEX
— Rajesh Kumar Reddy (@rajeshreddyega) March 21, 2023
kota Srinivasa rao fire on his fake death news.. Tollywood Actor Kota Srinivasa Rao Dismisses Death Rumors, Says Please Don’t Believe Them, kota Srinivasa rao death news video viral..