Kotha bangarulokam actress Shweta Basu Prasad and Rohit Mittal DIVORCED
Kotha bangarulokam actress Shweta Basu Prasad and Rohit Mittal DIVORCED

శ్వేతా బసు ప్రసాద్.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే జాతీయ అవార్డు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే యూత్ ను ఆకట్టుకుంది. కొత్త బంగారు లోకం చూసిన యూత్ మొత్తం ఆమెకు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుందేమోనని అందరూ భావించారు. కానీ అనుకోని రీతిలో కెరీర్ డౌన్ ఫాల్ మొదలైంది. ప్రస్తుతం కొన్ని సినిమాలలోనూ, సీరియల్స్, వెబ్ సిరీస్ లలోనూ శ్వేతా బసు ప్రసాద్ కనిపిస్తోంది. సినీ రంగానికే చెందిన రోహిత్ మిట్టల్ ను ఏడాది క్రితం ఆమె పెళ్లాడింది.. ఇది ప్రేమ పెళ్లి. ఈ ప్రేమ పెళ్లి ఎక్కువ రోజులు నిలబడేలా కనిపించలేదు. వారిరువురూ విడిపోడానికి సిద్ధపడ్డారు. వారిరువురూ పెళ్లి చేసుకుని ఒక్క ఏడాది కూడా అవ్వలేదు.. ఇంతలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

వివాహబంధానికి ముగింపు పలకాలని తాను, రోహిత్ పరస్పరం అంగీకారానికి వచ్చామని శ్వేత బసు ప్రసాద్ తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు తెలిపింది. లోతుగా చర్చించిన తర్వాత.. ఇరువురి భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయానికి వచ్చామని ఆమె సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ప్రతి పుస్తకాన్ని మనం పూర్తిగా చదవలేకపోవచ్చని.. దీని అర్థం ఆ పుస్తకం బాగోలేదని కాదని అంది. అంతేకాకుండా తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించినందుకు, తనకు స్ఫూర్తిగా నిలిచినందుకు రోహిత్ కు ధన్యవాదాలు తెలిపింది. రోహిత్ భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలని ఆమె కోరింది. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన తాష్కెంట్ ఫైల్స్ సినిమాలో శ్వేత చివరిగా కనిపించింది. 2002 లో మక్డీ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది శ్వేత. చంద్ర నందిని సీరియల్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది.