Aishwarya Rajesh Kaushalya Krishnamurthy Trailer
Aishwarya Rajesh Kaushalya Krishnamurthy Trailer

తమిళ్ హీరోయిన్ అయిన ఐశ్వర్యా రాజేష్ కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు.మారుమూల పల్లెటూళ్ళో,కటిక పేదరికంలో పుట్టిన ఒకమ్మాయి ఇంటర్నేషనల్ క్రికెటర్ గా ఎదిగిన ప్రస్థానం ఈ సినిమాలో చూపించారు.ఈ సినిమా ఆల్రెడీ తమిళ్ లో ‘కణా’ పేరుతో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సాధించింది.అయితే తెలుగు వెర్షన్ కి కూడా పెద్దగా మార్పులు చెయ్యలేదు.

ఈ టీజర్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది.ఆల్రెడీ తెలిసిన లైన్ నే భీమనేని శ్రీనివాసరావు భావోద్వేగాలతో కలగలిపి బాగా ఎమోషనల్ గా డీల్ చేసాడు అని అర్ధమవుతుంది ట్రైలర్ చూస్తుంటే.మాటలు కూడా అర్ధవంతంగా,ఆలోచింపజేసేలా ఉన్నాయి.ఈ సినిమా తమిళ్ వెర్షన్ లో కొన్ని సీన్స్ ని యాస్ ఇట్ ఈజ్ గా వాడుకున్నారు.అందుకే సినిమా నేచురాలిటీ అలానే ఉంది.సూపర్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అయిన ఐశ్వర్యా రాజేష్ కి రాజేంద్ర ప్రసాద్,ఝాన్సీ లాంటి అనుభవం ఉన్ననటీనటులు తోడవ్వడంతో సినిమా కంటెంట్ లో డెప్త్ మరింతగా పెరిగింది.ఇక తమిళ్ లో ఈ సినిమాని నిర్మించిన శివ కార్తికేయన్ అక్కడ పోషించిన గెస్ట్ క్యారెక్టర్ ని అలానే ఉంచేశారు.ఓవర్ ఆల్ గా చూస్తే ట్రైలర్ తో ప్రామిసింగ్ కంటెంట్ లా అనిపిస్తున్న కౌసల్య కృష్ణమూర్తి ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.