Kousalya Krishnamurthy Telugu Movie Review, Rating
Kousalya Krishnamurthy Telugu Movie Review, Rating

విడుదల తేదీ : ఆగస్టు 23, 2019
రేటింగ్ : 3.5/5
నటీనటులు : ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్, కార్తీక్ రాజు,ఝాన్సీ, వెన్నెల కిషోర్
దర్శకత్వం : భీమనేని శ్రీనివాస రావు
నిర్మాత‌లు : కే ఎస్ రామారావు
సంగీతం : ధిబు నినన్ థామస్
సినిమాటోగ్రఫర్ : అండ్రూ
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

ఐశ్వర్యా రాజేష్.ఈ పేరు ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.కానీ ఇక నుండి మాత్రం కచ్చితంగా గుర్తుండిపోతుంది.అలాంటి టాలెంట్ ఆమె సొంతం.తమిళ్ లో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ టాప్ లెవల్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె ఇప్పుడు కౌసల్య కృష్ణమూర్తి అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాతో తెలుగులోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తుంది. తమిళ్ లో కూడా ఆమె మెయిన్ లీడ్ గా నటించిన ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ కె ఎస్ రామారావు తెలుగులో రీమేక్ చేశారు.రీమేక్ స్పెషలిస్ట్ అని పేరున్న భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది?,ప్రేక్షకులకు ఎంతవరకు ఆకట్టుకుంది,ఐశ్వర్యా రాజేష్ కి డ్రీమ్ డెబ్యూ అందించిందా , లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఇరగవరం అనే పల్లెటూరి లో సన్నకారు రైతు అయిన కృష్ణమూర్తికి వ్యవసాయం అన్న, క్రికెట్ అన్న ప్రాణం.క్రికెట్ లో ఇండియా ఓడిపోతే తట్టుకోలేని మనస్తత్వం కృష్ణమూర్తిది.అది చూసిన కృష్ణమూర్తి కూతురు కౌసల్య..తన తండ్రి కి ఇష్టమైన క్రికెట్ నేర్చుకొని ఇండియానే గెలిపించి తన తండ్రి ముఖం లో సంతోషం చూడాలని కోరుకుంటుంది.

దాంతో క్రికెట్ నే సర్వస్వం గా భావించి సాధన చెయ్యడం మొదలుపెడతుంది.కానీ పేదరికం వల్ల ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి అడుగడుగునా అనేక అవాంతరాలు ఎదురవుతాయి.వాటన్నిటినీ ఎదుర్కొని ఆమె ఎలా జాతీయ జట్టులో చోటు సంపాదించుకుంది,అక్కడ ఎదురయిన ప్రతికూల పరిస్థితులను దాటి తన కలను నెరవేర్చుకుని తండ్రిని గర్వపడేలా చెయ్యడానికి ఆమె ఎదుర్కున్న సవాళ్లు ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటి నటులు:

ఏ పాత్రనైన అలవోకగా తనదైన శైలిలో నటించి మెప్పించే రాజేంద్రప్రసాద్,కృష్ణమూర్తి పాత్రకు ప్రాణం పోసాడు. అటు పంట చేతికిరాక ఇబ్బంది పడే సగటు రైతుగా, ఇటు కూతురు భవిష్యత్ గురించి బెంగతో భయపడే తండ్రిగా అద్భుతంగా నటించాడు రాజేంద్రప్రసాద్. ఇక అలనాటి నటుడు రాజేష్ కుతురైన ఐశ్వర్య రాజేష్ తమిళ్ లో దాదాపు 25 సినిమాలు చేసినా ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. కౌసల్య పాత్రలో ఆమె జీవించిందనే చెప్పాలి. రైతు కూతురిగా, క్రికెటర్ గా తనదైన శైలి లో నటించి మెప్పించింది. ఎమోషన్స్ సైతం పండించడంలో ఆమె తన బెస్ట్ ఫెర్ఫర్మెన్స్ ఇచ్చింది. ఇక కోచ్ గా నటించిన శివకార్తికేయన్ బాగా నటించాడు.కౌసల్య తల్లి పాత్రలో నటించిన ఝాన్సీ తన పాత్రలో బాగానటించింది అనే కన్నా ఓ మంచి పాత్రకు ఆమె ప్రాణం పోసింది అనవచ్చు. ఇక మిగతా నటీనటులు అందరూ బెస్ట్ అవుట్ ఫుట్ నిచ్చారు.

టెక్మిషియన్స్ :

రీమేక్ సినిమాలను తన దైన శైలి లో రూపొందించే భీమనేని శ్రీనివాస్ తమిళ్ రీమేక్ అయిన ఈ సినిమా కథను తెలుగు నేటివిటికి అనుగుణంగా చాలా చక్కగా తెరకెక్కించాడు. ఫీల్ మిస్సవకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. ఇక దిబు నైనన్ థామస్ సంగీతం సినిమాకి చాలా ప్లస్ అయ్యింది.ప్రతి సన్నివేశాన్ని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేసాడు.సినిమాటోగ్రఫీ బాగుంది.ఎడిటింగ్ లో మరిన్నీ జాగ్రత్త లు తీసుకొని ఉండాల్సింది.

ఫైనల్ గా:

కేవలం కమర్షియాలిటీ కి కట్టుబడి సగటు సినిమా కాకుండా అనేకమందకి ఇన్స్పిరేషన్ గా నిలిచే ఇలాంటి సినిమా అందించినందుకు దర్శక నిర్మాతలను అభినందించాలి. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ఈ సినిమాని ఎంచుకున్న ఐశ్వర్యా రాజేష్ అభినందించాలి.క్రికెట్ బ్యాక్ డ్రాప్,ఎమోషన్స్ లాంటివి ప్రేక్షకులకు నచ్చితే మాత్రం ఈ మంచి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పాస్ అయిపోతుంది.
బోటమ్ లైన్: సింపుల్ గా ‘సాగే’ స్పోర్ట్స్ డ్రామా