క్రేజీ అప్‌డేట్.. క్రాక్ దర్శకుడితో బాలకృష్ణ ఫిక్స్

330
Krack' director Gopichand likely to team up with Balakrishna

ఈ ఏడాది క్రాక్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. అయితే బాలకృష్ణ లాంటి పవర్ఫుల్ హీరోతో కమర్షియల్ మాస్ దర్శకులు సినిమా చేస్తే ఆ కిక్కు మామూలుగా ఉండదు. ఇక రానున్న రోజుల్లో బాలకృష్ణ కూడా తన స్టైల్ కు తగ్గట్లుగా మాస్ దర్శకులతోనే సినిమాలు చేయాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బాక్సాఫీస్ హిట్ చాలానే కష్టపడుతున్నాడు బాలకృష్ణ. ఇక ఆ సినిమా తరువాత బాలకృష్ణ ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయంలో ఇంకా అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు. బి.గోపాల్, అనిల్ రావిపూడి వంటి దర్శకులు రెడీగా ఉన్నట్లు టాక్ వస్తున్నప్పటికి ఇంకా ఫైనల్ కాలేదు. క్రాక్ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న గోపీచంద్ మలినేని ఇటీవలే నందమూరి బాలకృష్ణకు మాస్ ఎంటర్ టైనర్ స్టోరీ వినిపించగా..సింగిల్ సిట్టింగ్ లో కథను ఓకే చేసినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ ఏడాది మే నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ టీం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం.